News November 1, 2024

ఉ.కొరియా సైనికుల శవాలు బ్యాగుల్లో వెళ్తాయి: US

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులను పంపడంపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే బలగాలను ఉపసంహరించుకోవాలని ఐరాసలోని US డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ హెచ్చరించారు. లేదంటే వారి శవాలు బ్యాగ్‌లలో తిరిగెళ్తాయని స్పష్టం చేశారు. వెస్ట్రన్ కంట్రీస్ ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నప్పుడు మాస్కోకు ఉ.కొరియా మద్దతు ఇస్తే తప్పేంటని రష్యా రాయబారి వాసిలీ నెజెంబియా ప్రశ్నించారు.

Similar News

News November 1, 2024

వెంకీ మామ కొత్త మూవీ టైటిల్ ఇదే!

image

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న సినిమా టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ ఖరారు చేస్తూ స్పెషల్ పోస్టర్ పోస్ట్ చేశారు. ఇది వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఉండనుంది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీకి భీమ్స్ మ్యూజిక్ అందించారు. కాగా వచ్చే ఏడాది జనవరి 10న రామ్ చరణ్ నటిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ కూడా విడుదలవనుంది.

News November 1, 2024

300 అప్లికేషన్స్, 500 ఈమెయిల్స్.. ఎట్టకేలకు ఉద్యోగం

image

పుణేకు చెందిన ధ్రువ్ లోయా అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషి సోషల్ మీడియాలో వైరలవుతోంది. USలోనే చదువుకున్న అతను జాబ్ కోసం 5 నెలల్లో 300 దరఖాస్తులు, 500కుపైగా ఈమెయిల్స్ పంపారు. 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరవగా ఎట్టకేలకు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్టుగా కొలువు సాధించారు. ఈ విషయాన్ని అతను linkedinలో పోస్టు చేయగా అందరూ అభినందిస్తున్నారు.

News November 1, 2024

సర్వర్ డౌన్.. పెన్షన్ల పంపిణీకి బ్రేక్

image

ఏపీ వ్యాప్తంగా నవంబర్ నెల పింఛన్ల పంపిణీకి బ్రేక్ పడింది. ఉదయం ఏడు గంటల వరకు పింఛన్లు పంపిణీ చేయగా సర్వర్ సమస్య తలెత్తింది. అన్ని జిల్లాల్లో పంపిణీని సచివాలయ ఉద్యోగులు నిలిపివేశారు. దీంతో లబ్ధిదారులు సచివాలయాలకు వెళ్లి వాకబు చేస్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కారం అయిన వెంటనే తిరిగి పంపిణీని ప్రారంభిస్తామని ఉద్యోగులు వారికి చెప్పి పంపిస్తున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ సమాచారం అందిస్తున్నారు.