News November 1, 2024
పెరిగిన సిలిండర్ ధర

దీపావళి తర్వాత ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను రూ.61 మేర పెంచాయి. దీంతో ప్రస్తుతం HYDలో కమర్షియల్ LPG ధర రూ.2,028కి చేరింది. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.
Similar News
News January 14, 2026
ఇంట్రెస్టింగ్ విషయం పంచుకున్న అనిల్ రావిపూడి

టాలీవుడ్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలుగు ప్రజలకు భోగి శుభాకాంక్షలు చెబుతూ ఆసక్తికరమైన విషయం పంచుకున్నారు. తన కెరీర్లో వరుసగా ఆరు సినిమాలు ₹100Cr+ క్లబ్లో చేరినట్లు వెల్లడించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవితో తీసిన <<18853731>>MSVPG<<>> అయితే 2రోజుల్లోనే ఈ ఫీట్ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతిని మరింత స్పెషల్‌గా మార్చారంటూ ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.
News January 14, 2026
ఎన్డీఏతో కలిసే ప్రసక్తే లేదు: TVK

రాజకీయంగా తమను ఇబ్బందులు పెట్టినా NDAతో కలిసే ప్రసక్తే లేదని విజయ్ దళపతి TVK స్పష్టం చేసింది. తమ సిద్ధాంత వైఖరిలో మార్పు ఉండదని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ చెప్పారు. జన నాయగన్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందనను స్వాగతిస్తున్నామని, ఇది స్నేహపూర్వక మద్దతుగానే భావిస్తున్నట్లు చెప్పారు. కాగా జన నాయగన్‌కు సెన్సార్ సర్టిఫికెట్ రాకుండా BJPనే అడ్డుకుంటోందని TVK ఆరోపిస్తోంది.
News January 14, 2026
మకరజ్యోతి వేళ.. శబరిమలలో మరో స్కామ్!

కేరళ శబరిమల ట్రావెన్కోర్ దేవస్వం బోర్డులో మరో స్కామ్ బయటపడింది. అయ్యప్ప అభిషేకం కోసం భక్తులు ఆలయం వద్ద కొనే నెయ్యి ప్యాకెట్ల డబ్బు రూ.35 లక్షలు బోర్డుకు చేరలేదు. ఇది గుర్తించిన ప్రభుత్వం కేసును ACBకి అప్పగించింది. ఇప్పటికే 5Kgs బంగారు తాపడాల మిస్సింగ్ స్కామ్ రాజకీయంగానూ దుమారం రేపుతుండగా ఈ ఉదంతంతో ప్రభుత్వం మరింత కార్నర్ కానుంది. అటు ఈ సాయంత్రం పొన్నాంబలమేడు కొండపై మకరజ్యోతి దర్శనం ఇవ్వనుంది.


