News November 1, 2024

గెలవాలనే మైండ్‌సెట్ ఉన్న వారినే రిటైన్ చేసుకున్నాం: LSG ఓనర్

image

ఐపీఎల్: లక్నో రిటెన్షన్లపై ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జట్టు కోసం ఆడే, గెలవాలనే మైండ్‌సెట్ ఉన్న ప్లేయర్లనే మేం రిటైన్ చేసుకున్నాం. టీం కాకుండా వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడేవాళ్లను పక్కనబెట్టాం’ అని వ్యాఖ్యానించారు. కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించే గోయెంకా ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. రాహుల్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.

Similar News

News February 19, 2026

పోలీసులపై అంబటి రాంబాబు ఆగ్రహం

image

AP: నిన్న జైలు నుంచి విడుదలైన YCP నేత అంబటి రాంబాబుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజమండ్రి నుంచి గుంటూరుకు ఊరేగింపుగా వెళ్లొద్దని తెలిపారు. దీనిపై అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ’18 రోజుల తర్వాత ఇంటికి వెళ్తుంటే ఏంటీ నిర్బంధాలు? నేనేమైనా ర్యాలీ తీస్తున్నానా? ఆంక్షలు ఎందుకు? 10 మంది కార్యకర్తలు వచ్చి నన్ను పలకరించడం తప్పా?’ అని ప్రశ్నించారు. పోలీసుల తీరుకు నిరసనగా కారు దిగి నడుచుకుంటూ వెళ్లారు.

News February 19, 2026

షాకిచ్చిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ₹2,290 పెరిగి ₹1,56,490కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు ₹2,100 ఎగబాకి ₹1,43,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ ధర ఏకంగా ₹10 వేలు పెరిగి ₹2,70,000గా ఉంది. ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చు.

News February 19, 2026

రాష్ట్ర పండుగగా రాజాం పైడితల్లి అమ్మవారి జాతర

image

AP: విజయనగరం(D) రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. ఉత్సవాలకు రూ.50లక్షల నిధుల మంజూరుకు ఆదేశాలిచ్చింది. తదుపరి చర్యలు తీసుకోవాలని దేవదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. పైడితల్లి ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు. అమ్మవారి ఉత్సవాలు 1758 నుంచి ఏటా నిరాటంకంగా కొనసాగుతున్నాయి.