News November 1, 2024

IPL రిటెన్షన్లలో బ్యాటర్లదే పైచేయి

image

నిన్న IPL రిటెన్షన్ల ప్రక్రియ హాట్‌హాట్‌గా సాగింది. ఈ రిటెన్ష‌న్‌లో ఫ్రాంచైజీలు ఎక్కువగా బ్యాటర్లనే రిటైన్ చేసుకున్నాయి. మొత్తం 28 మంది బ్యాటర్లు రిటైన్ కాగా బౌలర్లు కేవలం 11 మంది రిటైన్ అయ్యారు. ఇక ఆల్‌రౌండర్ల విషయానికి వస్తే ఏడుగురిని ఆయా జట్లు తమతో అట్టిపెట్టుకున్నాయి. అత్యధిక ధర కూడా బ్యాటర్లకే పలికిన విషయం తెలిసిందే.

Similar News

News February 14, 2026

IND vs PAK: రేపు ‘మహా’ సంగ్రామం.. ఇప్పటి వరకు మనదే జోరు!

image

T20 WCలో IND vs PAK మధ్య ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు జరగ్గా 7-1తో మనదే ఆధిపత్యం. 2007 ‘బౌల్ అవుట్’ విక్టరీ నుంచి 2024 ‘న్యూయార్క్ లో-స్కోరింగ్ థ్రిల్లర్’ వరకు భారత్ తన సత్తాను చాటుతూనే ఉంది. విరాట్ కోహ్లీ మెల్బోర్న్ మిరాకిల్ (2022), బుమ్రా డెత్ ఓవర్ల మ్యాజిక్ (2024) వంటి మధుర జ్ఞాపకాలతో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. రేపటి మ్యాచ్‌లోనూ దాయాదుల పోరు ఆసక్తికరంగా సాగనుంది. IND విజయాల ఫొటోలను పైన చూడొచ్చు.

News February 14, 2026

నేలలో అధిక తేమ వల్ల పంటల్లో కనిపించే సమస్యలు

image

నేలలో అధిక తేమ వల్ల కూరగాయల తోటల్లో నారుకుళ్లు, మొక్క ఎదుగుదల తగ్గటం, పూతరాలటం, ఎండు తెగులు, ఆకుమచ్చ తెగులు, కాయకుళ్లు, ఆకులు పసుపుబారటం, అక్షింతల పురుగు, బ్యాక్టీరియా ముచ్చ తెగులు, బూడిద తెగులు.. ఆకుకూరల్లో మొక్క మొదలుకుళ్లు, ఆకుతినే పురుగు, ఆకుమచ్చ తెగులు వస్తాయి. దుంప జాతుల్లో దుంప కుళ్లు, అధిక శాఖీయోత్పత్తి సమస్యలు కనిపిస్తాయి. బత్తాయి, నిమ్మ, ద్రాక్ష, జామ, మామిడిలో అధిక తేమ ప్రభావం ఎక్కువ.

News February 14, 2026

ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

image

<>ఇందిరాగాంధీ<<>> నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ 15 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ఇంటర్వ్యూ కు హాజరుకావచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్‌డీ, NET/SET అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. నెలకు జీతం రూ.50,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://portal.igntu.ac.in