News November 1, 2024

నువ్వా?నేనా?.. కమల vs ట్రంప్

image

అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి సపోర్ట్ చేసే బడా వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఈసారి డెమొక్రటిక్ పార్టీకి అండగా ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ విధానంపై కఠినంగా వ్యవహరిస్తానని ట్రంప్ చెప్పడంతో ప్రవాస ఓటర్లు ఆయనకు వ్యతిరేకంగా ఓటేసే ఛాన్స్ ఉంది. నిరుద్యోగం, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్-ఇరాన్ యుద్ధాలు కమల పార్టీకి దెబ్బకొట్టే అవకాశాలున్నాయి. తాను వస్తేనే US ఆర్థికవ్యవస్థ గాడిన పడుతుందని ట్రంప్ చెబుతున్నారు.

Similar News

News February 2, 2026

కేంద్ర బడ్జెట్.. నిరాశలో ఉమ్మడి ఖమ్మం

image

కేంద్ర బడ్జెట్‌లో ఖమ్మం జిల్లా ప్రాజెక్టుల ప్రస్తావన లేకపోవడంతో జిల్లావాసులు తీవ్ర నిరాశకు గురయ్యారు. KTDM ఎయిర్‌పోర్ట్, భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్, బయ్యారం స్టీల్ ప్లాంట్ వంటి కీలక అంశాలపై కేంద్రం మొండిచేయి చూపింది. ఏటా గంపెడాశతో ఎదురుచూడటం, తీరా బడ్జెట్‌లో మొండిచేయి ఎదురవ్వడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. విభజన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని జిల్లా వాసులు ఉసూరుమంటున్నారు.

News February 2, 2026

పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

image

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

News February 2, 2026

స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

image

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.