News November 1, 2024
300 అప్లికేషన్స్, 500 ఈమెయిల్స్.. ఎట్టకేలకు ఉద్యోగం
పుణేకు చెందిన ధ్రువ్ లోయా అనే యువకుడు అమెరికాలో ఉద్యోగం కోసం పట్టువదలని విక్రమార్కుడిలా చేసిన కృషి సోషల్ మీడియాలో వైరలవుతోంది. USలోనే చదువుకున్న అతను జాబ్ కోసం 5 నెలల్లో 300 దరఖాస్తులు, 500కుపైగా ఈమెయిల్స్ పంపారు. 10 ఇంటర్వ్యూలకు కూడా హాజరవగా ఎట్టకేలకు ఎలాన్ మస్క్ కంపెనీ టెస్లాలో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్టుగా కొలువు సాధించారు. ఈ విషయాన్ని అతను linkedinలో పోస్టు చేయగా అందరూ అభినందిస్తున్నారు.
Similar News
News November 1, 2024
తిప్పేసిన స్పిన్నర్లు.. కివీస్ 235 ఆలౌట్
టీమ్ ఇండియాతో జరుగుతున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ 235 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లు రవీంద్ర జడేజా, సుందర్ స్పిన్ మ్యాజిక్‌తో కివీస్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఆ జట్టులో విల్ యంగ్ (71), డారిల్ మిచెల్ (82) అర్ధ సెంచరీలతో రాణించారు. జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ ఒక వికెట్ తీశారు.
News November 1, 2024
సాయంత్రం 6 నుంచి 7 వరకు ముహూరత్ ట్రేడింగ్
స్టాక్ మార్కెట్లకు నేటి సాయంత్రం ముహూరత్ ట్రేడింగ్‌తో కొత్త ఏడాది ప్రారంభంకానుంది. NSE, BSEలో సాయంత్రం 6 నుంచి 7 వరకు ట్రేడింగ్ జరగనుంది. పండుగ సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్‌లో కొత్తగా పెట్టే పెట్టుబడులు రాబోయే రోజుల్లో అధిక రాబడులు ఇస్తాయని ఇన్వెస్టర్లు విశ్వసిస్తారు. దీర్ఘకాలంలో వృద్ధికి అవకాశం ఉండి అందుబాటు ధరలో ఉన్న స్టాక్స్‌ను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News November 1, 2024
5ఏళ్లలో 7ఏళ్ల వయసెలా పెరిగింది?: BJP
ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై ఆ రాష్ట్ర BJP సెటైర్లు వేసింది. ఆయన వయసు 5ఏళ్లలోనే 7ఏళ్లు ఎలా పెరిగిందంటూ ప్రశ్నిస్తోంది. సోరెన్ 2019 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తన వయసు 42ఏళ్లుగా పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌లో 49ఏళ్లుగా వెల్లడించారు. దీంతో ఆయన వయసులో వ్యత్యాసంపై BJP ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.