News November 1, 2024
డబ్బు లేకుంటే ఏం.. రిక్షావాలా దీపావళి సెలబ్రేషన్ సూపర్
దేశవ్యాప్తంగా దీపావళి వెలుగులు విరజిమ్మాయి. నింగిలోకి దూసుకెళ్లే రాకెట్లు, భారీ ఔట్లతో ఊరూవాడా మోత మోగింది. అయితే పండుగ అందరికీ ఘనం కాదు కదా. ఖర్చు పెట్టలేని వారు ఎందరో ఉన్నారు. అయితే ఢిల్లీలో ఓ రిక్షావాలా తనకు ఉన్నంతలో పండుగను జరుపుకున్న తీరు ఆకట్టుకుంటోంది. రిక్షాను కొవ్వొత్తులతో నింపి దీపావళి విజయ కాంతులు తన జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Similar News
News November 1, 2024
ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్.. మానవత్వం ఉంది: చంద్రబాబు
AP: దేశంలో రూ.4 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా మానవత్వం ఉందని చెప్పారు. ‘సిలిండర్‌కు చెల్లించిన డబ్బులను 48 గంటల్లోనే రీఫండ్ చేస్తాం. అసలు సిలిండర్‌కు ముందే డబ్బు కట్టే పనిలేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. డ్వాక్రా మహిళలకు పూర్వవైభవం తీసుకువస్తాం. వారికి రివాల్వింగ్ ఫండ్, వడ్డీ లేని రుణాలు ఇచ్చాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
News November 1, 2024
రిపబ్లికన్ల ఫారిన్ పాలసీ డిఫరెంట్
అమెరికా ఫస్ట్ నినాదంలో పనిచేసే ట్రంప్ విదేశీ దిగుమతులపై సార్వత్రిక సుంకం 20% విధించాలన్న అతని ప్రణాళికలు ట్రేడ్ వార్‌కు దారి తీయవచ్చని భావిస్తున్నారు. ఇక వాతావరణ మార్పులను లైట్ తీసుకొనే ట్రంప్ బైడెన్ తెచ్చిన పర్యావరణ చట్టాలను రద్దు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు మద్దతు నిలిపివేసి మాస్కో శాంతి ఒప్పందానికి అంగీకరించేలా కీవ్‌పై ఒత్తిడి తేవచ్చని అభిప్రాయపడుతున్నారు.
News November 1, 2024
విద్యార్థులకు కొత్త డైట్ ప్లాన్: సీఎం రేవంత్
TG: ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. 10 రోజుల్లో కొత్త డైట్‌ను తీసుకురావాలని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సీఎంను కలిసి పలువురు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.