News November 1, 2024
పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల సమీక్ష
TG: రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని, మార్కెట్‌కు వచ్చిన పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులు 8897281111 హెల్ప్‌లైన్ నంబరు సేవలను వినియోగించుకోవాలని కోరారు. కాగా అకాల వర్షాలకు మార్కెట్లలో ఉన్న పత్తి తడిచిపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 1, 2024
దుల్కర్-సాయి పల్లవి కాంబోలో తెలుగు మూవీ?
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కాంబోలో ఓ మూవీ తెరకెక్కనుంది. వైజయంతి మూవీస్ నిర్మించనున్న ‘ఆకాశంలో ఒక తార’ అనే తెలుగు సినిమాలో వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించనున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు వెల్లడించాయి. కాగా, దుల్కర్ ‘లక్కీ భాస్కర్’, సాయి పల్లవి నటించిన ‘అమరన్’ నిన్న విడుదలైన విషయం తెలిసిందే.
News November 1, 2024
అన్నక్యాంటీన్లలో ఉచిత భోజనం అందించే ఆలోచన: గంటా
AP: స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో ఉన్నామని టీడీపీ MLA గంటా శ్రీనివాసరావు అన్నారు. ఉక్కు పరిశ్రమపై ఇప్పటికే ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడారని చెప్పారు. అవసరమైతే మరోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో మాట్లాడుతామని తెలిపారు. భవిష్యత్తులో అన్న క్యాంటీన్లలో భోజనం ఉచితంగా అందించే ఆలోచన ఉందని వెల్లడించారు. విశాఖకు మరిన్ని IT కంపెనీలు తీసుకొచ్చేలా మంత్రి లోకేశ్ కృషి చేస్తున్నారని అన్నారు.
News November 1, 2024
11 సీట్లే వచ్చినా నోరు లేస్తోంది: పవన్
AP: సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. 11 సీట్లు వచ్చినా వారికి నోళ్లు మూతపడడం లేదని విమర్శించారు. ‘ప్రతి ఒక్కరి కడుపు నింపేందుకే దీపం 2.0 పథకం తీసుకువచ్చాం. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం. ఇప్పటికిప్పుడే అన్ని సమస్యలను తీర్చలేం. దీనిపై విమర్శలు చేయడం సరికాదు’ అని ఆయన హెచ్చరించారు.