News November 1, 2024
కామారెడ్డి: డబ్బుల కోసం తండ్రి హత్య

కామారెడ్డి జిల్లాలో నస్రుల్లాబాద్‌లో <<14501984>>హత్య <<>>జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. నెమలి గ్రామానికి చెందిన హన్మాండ్లు మద్యానికి బానిస అయ్యాడు. గురువారం అర్ధరాత్రి డబ్బుల విషయంలో తండ్రి సాయిబోయి(55)తో గొడప పడ్డాడు. ఈక్రమంలో మద్యం మత్తులో ఉన్న హన్మాండ్లు కర్రతో కొట్టడంతో చనిపోయాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News January 10, 2026
NZB: కలెక్టర్, సలహాదారుని కలిసిన రెడ్ క్రాస్ సభ్యులు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని NZB జిల్లా రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. కమిటీ జిల్లా ఛైర్మన్ ఆంజనేయులు జిల్లా రెడ్ క్రాస్ గురించి వివరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కోశాధికారి కరిపే రవీందర్, జూనియర్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ అబ్బపూర్ రవీందర్, వరుణ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
News January 10, 2026
నిజామాబాద్: రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. పొతంగల్ (M) కొడిచర్లకు చెందిన సాయికుమార్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. జక్రాన్ పల్లి(M) పడకల్‌కు చెందిన తలారి నరేందర్ (35) సైతం ట్రాక్టర్ పై నుంచి పడి మృతి చెందాడు. ఆలాగే కామారెడ్డి జిల్లా మద్నూర్(M) 161 జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణ పవార్ (40) దుర్మరణం పాలయ్యాడు.
News January 9, 2026
టీయూ: అంతర్ కళాశాల క్రికెట్ పోటీలు

టీయూ ఇంటర్ కాలేజ్ పురుషుల క్రికెట్ టోర్నమెంట్ పోటీల ఫైనల్ మ్యాచ్‌ను శుక్రవారం వర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించినట్లు స్పోర్ట్స్ డైరెక్టర్ డా.బాలకిషన్ తెలిపారు. తుదిపోరు నిశిత డిగ్రీ కళాశాల, గిరిరాజ్ కళాశాల మధ్య జరగగా నిశిత కళాశాల విజేతగా నిలిచింది. ఈ మేరకు ముఖ్య అతిథిగా హాజరైన కళాశాల ప్రిన్సిపల్ డా.రాంబాబు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీ నేత, ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు.


