News November 1, 2024
SPF భద్రత వలయంలో సచివాలయం
తెలంగాణ సచివాలయ భద్రత బాధ్యతలను నేటి నుంచి SPF(స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) చూసుకోనుంది. గతంలో TGSP బెటాలియన్‌కు చెందిన సిబ్బంది సచివాలయ భద్రతను చూసుకున్నారు. అయితే రాష్ట్ర విభజనకు ముందు ఈ బాధ్యతలు SPF చూసుకునేది. BRS ప్రభుత్వం TGSPకి అప్పగించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సచివాలయ బాధ్యతలను SPFకు అప్పగించింది.
Similar News
News November 1, 2024
జేఎంఎం మొత్తం ఓ నకిలీ వ్యవస్థ: హిమంత బిశ్వ
ఝార్ఖండ్ ముక్తి మోర్చా మొత్తం ఓ నకిలీ వ్యవస్థ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. CM హేమంత్ సోరెన్ వయసుపై వివాదం రేగడంపై ఆయన స్పందించారు. ‘JMM వ్యవస్థ మొత్తం నకిలీ. అఫిడవిట్‌ను పరిశీలిస్తే సోరెన్ వయసు కూడా పెరిగింది. ఇది చొరబాటుదారుల ప్రభుత్వం. JMMను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఎవరూ సురక్షితంగా ఉండరు. ప్రజలు బాధ్యతగా వారిని గద్దెదించాలి’ అని శర్మ పిలుపునిచ్చారు.
News November 1, 2024
IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి
పాక్ బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ IED బాంబును పేల్చిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మస్తాంగ్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి చౌక్ వద్ద పోలీసు వ్యాన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. ముందుగానే పార్కింగ్ చేసిన బైక్‌లో బాంబులు ఉంచి రిమోట్ కంట్రోల్‌తో వాటిని పేల్చినట్టు మస్తాంగ్ DPO ఉమ్రానీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్కూల్ పిల్లలు, ఒక పోలీసు ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు.
News November 1, 2024
ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై ఫిర్యాదు చేసే వారికి ప్రభుత్వ రక్షణ
AP: ఉద్యోగుల అవినీతి విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులపై ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు పెట్టేవారికి రక్షణ కల్పించనుంది. నోడల్ అధికారిగా ఇంటెలిజెన్స్ చీఫ్ లడ్డాను నియమించింది. ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ కమిషన్‌కు ఫిర్యాదు చేసే వారికి అండగా ఉండేలా నోడల్ అధికారి కార్యాచరణ రూపొందించనున్నారు. వివరాలకు 0866-2428400/2974075 నంబర్లకు ఫోన్ చేయండి.