News November 1, 2024

డేటా ధరలు మన దగ్గరే తక్కువ!

image

దేశంలో ఇంటర్నెట్ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రజలకు అందుబాటు ధరలకే ఇంటర్నెట్ లభిస్తుండం దీనికి ప్రధాన కారణం. ఒకప్పుడు 1GB డేటా కోసం రూ.254 చెల్లించాల్సి వచ్చేది. అది ఇప్పుడు రూ.8కే వస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్‌లో ఇంటర్నెట్ ధరలు అధికంగా ఉన్నాయి. అక్కడ 1GB ధర $7.29 (రూ.612). ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ ($6.00), న్యూజిలాండ్ ($5.89), కెనడా ($5.37), దక్షిణ కొరియా ($5.01) ఉన్నాయి.

Similar News

News November 15, 2024

SALUTE: చేయి చేయి కలిపి.. ఊరి దారిని బాగుచేసి..

image

AP: అనారోగ్యమొస్తే వేగంగా ఆస్పత్రికి వెళ్లే దారే ఆ ఊరికి లేదు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్థులంతా ఏకమై పలుగు, పార చేతపట్టి శ్రమదానంతో 5KM మేర మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఘటన అల్లూరి(D) పెదబయలు(M) పెదకొండాలో జరిగింది. ఇప్పటికైనా పక్కారోడ్డును నిర్మించాలని కోరుతున్నారు. వారి స్ఫూర్తికి సెల్యూట్ చేయాల్సిందే.

News November 15, 2024

జగన్ ఒక్క ఛాన్స్ అని నాశనం చేశారు: సీఎం

image

AP: జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. భూమి ఉంది కాబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అందుకే అమరావతి కోసం భారీగా భూమి కావాలనుకున్నామని వివరించారు.

News November 15, 2024

మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు

image

అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టు విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. MH వార్ధాలో ఓ వ్యక్తి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్థనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.