News November 1, 2024

5ఏళ్లలో 7ఏళ్ల వయసెలా పెరిగింది?: BJP

image

ఝార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌పై ఆ రాష్ట్ర BJP సెటైర్లు వేసింది. ఆయన వయసు 5ఏళ్లలోనే 7ఏళ్లు ఎలా పెరిగిందంటూ ప్రశ్నిస్తోంది. సోరెన్ 2019 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో తన వయసు 42ఏళ్లుగా పేర్కొన్నారు. కాగా ఇప్పుడు ఇచ్చిన అఫిడవిట్‌లో 49ఏళ్లుగా వెల్లడించారు. దీంతో ఆయన వయసులో వ్యత్యాసంపై BJP ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆయన నామినేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.

Similar News

News November 1, 2024

కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే చర్యలు: నిరంజన్

image

TG: కులగణనను రాజకీయం చేయవద్దని BC కమిషన్ ఛైర్మన్ నిరంజన్ కోరారు. ‘ఇదొక బృహత్తర కార్యక్రమం. కులం పేరు తప్పుగా నమోదు చేయించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. BCల జనాభా తేల్చేందుకు ఈ సర్వే కీలకం. 52% BCలు ఉన్నారని చెప్పుకుంటూ వస్తున్నాం. దాన్ని నిరూపించుకునేందుకు ఇదే అవకాశం. మళ్లీ కులగణన జరుగుతుందో లేదో తెలియదు. కులసంఘాలు దీనిలో కీలకపాత్ర పోషించాలి. ప్రజలూ సహకరించాలి’ అని కోరారు.

News November 1, 2024

రూపాయి: విలువ కంటే ఖర్చెక్కువ!

image

నిత్యం మనం వినియోగించే కరెన్సీ తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ₹1.11 ఖర్చు అవుతుంది. ఇది నాణెం విలువ కంటే ఎక్కువ. రెండు రూపాయల నాణేనికి ₹1.28, 5 రూపాయల నాణేనికి ₹3.69 ఖర్చవుతుంది. రూ.10 నోట్ల ముద్రణకు ₹0.96, ₹20కి ₹0.95, రూ.50కి ₹1.13, ₹100కి ₹1.77 ఖర్చవుతుంది. UPI వినియోగం అధికంగా ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటికీ ₹34.7 లక్షల కోట్ల నగదు సర్క్యులేషన్‌లో ఉంది.

News November 1, 2024

Muhurat Trading 2024: లాభాలతో ఆరంభం

image

దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త ఏడాదిని లాభాల‌తో ప్రారంభించాయి. దీపావళి సందర్భంగా శుక్రవారం సాయంత్రం జరిగిన ముహూరత్ ట్రేడింగ్‌లో సెంటిమెంట్ ప్ర‌కారం ఇన్వెస్ట‌ర్లు కొనుగోళ్ల‌కు ఎగ‌బడ్డారు. దీంతో సెన్సెక్స్ 335 పాయింట్ల లాభంతో 79,724 వద్ద, నిఫ్టీ 99 పాయింట్ల లాభంతో 24,304 వద్ద స్థిరపడ్డాయి. బ్యాంకింగ్ మొద‌లుకొని హెల్త్‌కేర్ వ‌ర‌కు అన్ని రంగాలు గ్రీన్‌లో ముగిశాయి. IT స్వల్ప నష్టాలు చవిచూసింది.