News November 1, 2024

ఎంత దారుణం.. అవతరణ దినం నిర్వహించరా?: రోజా

image

చంద్రబాబు సీఎం అవడం వల్ల APకి అవతరణ దినం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా విమర్శించారు. ‘వైసీపీ పాలనలో NOV 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం ఘనంగా నిర్వహించాం. కూటమి ప్రభుత్వం దీనిని నిర్వహించకపోవడం ఎంత దారుణం. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవహేళన చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? భావితరాలకు ఏం చెప్తారు? 6 కోట్ల ఆంధ్రులను అవమానించినందుకు పవన్, బాబు క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

Similar News

News November 15, 2024

నేడు బడ్జెట్‌పై చర్చ

image

AP: మొన్న ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఈరోజు అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ సందర్భంగా సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ సమాధానం ఇస్తారు. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బిల్లు, ఏపీ ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లులను సభలో ప్రవేశపెడతారు.

News November 15, 2024

ఆటిజంపై స్పెషల్ ఫోకస్: మంత్రి సత్యకుమార్

image

AP: రాష్ట్రంలో ఆటిజం లక్షణాలున్న పిల్లలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ వెల్లడించారు. మొదటి రెండేళ్లలో లక్షణాలను గుర్తిస్తే దీన్ని నివారించగలమని అసెంబ్లీలో అన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో పాటిస్తున్న తీరును పరిశీలిస్తామని తెలిపారు. ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చేందుకు యత్నిస్తున్నామన్నారు.

News November 15, 2024

ఇంగ్లండ్ టార్గెట్ 146 రన్స్

image

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ పావెల్(54), రొమారియో షెఫర్డ్(30) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, ఓవర్టన్ 3, ఆర్చర్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే 146 రన్స్ చేయాలి.