News November 1, 2024
టెక్కలి లేదా పలాస ఎయిర్ పోర్టు నిర్మాణం: సీఎం చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లా మూలపేట పోర్టు సమీపంలో సుమారు 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఈదుపురం సభలో ఆయన మాట్లాడుతూ.. టెక్కలి లేదా పలాస ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. చంద్రబాబు ప్రకటనతో జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News January 16, 2026
శ్రీకాకుళం: నేటి నుంచి ఇక్కడ సంక్రాంతి మొదలు

శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని <<18868852>>కొసమాలలో<<>> దేవాంగుల వీధిలో కనుమ రోజున భోగి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వీధిలోని చేనేత కార్మికులు నేడు భోగి వేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. నందిగాం పరిధిలోని పెద్దతామరాపల్లిలోనున్న పెద్దదేవాంగులవీధిలో ఇదే ఆచారాన్ని పాటిస్తారు. మీ పరిధిలో నేటి సంక్రాంతి వేడుకలను జరుపుకుంటే కామెంట్‌లో తెలపండి.
News January 16, 2026
ఎల్.ఎన్.పేట: పండగపూట విషాదం.. యువకుడు మృతి

ఎల్.ఎన్.పేట(M) మోదుగువలస నిర్వాసితుల కాలనీకి చెందిన సాయికుమార్(25) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. భోగి రోజు సాయికుమార్ మరో యువకుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తూ స్కాట్ పేట వద్ద నడిచి వెళుతున్న వ్యక్తిని ఢీకొని కిందపడ్డారు. సాయికుమార్ మృతితో గ్రామంలో విషాద చ్ఛాయలు అలముకున్నాయి. దీనిపై కేసు నమోదు చేసినట్లు సరుబుజ్జిలి ఎస్ఐ హైమావతి తెలిపారు.
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.


