News November 1, 2024
IED బాంబు పేల్చిన ఉగ్రవాదులు.. ఏడుగురు మృతి
పాక్ బలూచిస్తాన్ ప్రావిన్సులో ఉగ్రవాదులు రిమోట్ కంట్రోల్డ్ IED బాంబును పేల్చిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. మస్తాంగ్ జిల్లాలోని సివిల్ ఆస్పత్రి చౌక్ వద్ద పోలీసు వ్యాన్ టార్గెట్‌గా ఈ దాడి జరిగింది. ముందుగానే పార్కింగ్ చేసిన బైక్‌లో బాంబులు ఉంచి రిమోట్ కంట్రోల్‌తో వాటిని పేల్చినట్టు మస్తాంగ్ DPO ఉమ్రానీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు స్కూల్ పిల్లలు, ఒక పోలీసు ఉన్నారు. మరో 17 మంది గాయపడ్డారు.
Similar News
News November 1, 2024
గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయింపు
TG: సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి భూమి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 837/1లో 211 ఎకరాలు కేటాయిస్తున్నట్లు రెవెన్యూ శాఖ ప్రకటించింది. భూకేటాయింపులు జరపడంతో యూనివర్సిటీ నిర్మాణ పనుల్లో వేగం పుంజుకోనుంది.
News November 1, 2024
ఆ దేశంలో విడాకుల రేటు 94%?
ప్రపంచంలోనే అత్యధికంగా పోర్చుగల్‌లో విడాకుల రేటు 94%గా ఉన్నట్లు ఓ స్టడీ తెలిపింది. ఆ తర్వాత స్పెయిన్ (85%), లక్సెంబర్గ్ (79%), రష్యా (73%), ఉక్రెయిన్ (70%), క్యూబా (55%), ఫిన్లాండ్ (55%), బెల్జియం (53%), ఫ్రాన్స్ (51%), నెదర్లాండ్స్ (48%), కెనడా (47%), యూఎస్ (45%), చైనా (44%), యూకే (41%), జర్మనీ (38%), టర్కీ (25%), ఈజిప్టు (17%), ఇరాన్ (14%), తజికిస్థాన్ (10%), వియత్నాం (7%), ఇండియా (1%) ఉన్నాయి.
News November 1, 2024
దేవాలయాల ఆస్తుల రక్షణకు కార్యాచరణ
AP వ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ శాఖ పరిధిలో ఆక్రమణలు, అన్యాక్రాంతమైన భూముల వివరాలు తెలియజేయాలని ఆ శాఖ కమిషనర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలో కార్యాచరణ రూపొందించాలన్నారు. ఐ.ఎస్.జగన్నాథపురం <<14505508>>ఆలయం<<>> 50 ఎకరాల భూమి రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ కొండ తవ్వకంపై విచారణకు ఆదేశించారు.