News November 1, 2024
జేఎంఎం మొత్తం ఓ నకిలీ వ్యవస్థ: హిమంత బిశ్వ
ఝార్ఖండ్ ముక్తి మోర్చా మొత్తం ఓ నకిలీ వ్యవస్థ అని అస్సాం CM హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. CM హేమంత్ సోరెన్ వయసుపై వివాదం రేగడంపై ఆయన స్పందించారు. ‘JMM వ్యవస్థ మొత్తం నకిలీ. అఫిడవిట్‌ను పరిశీలిస్తే సోరెన్ వయసు కూడా పెరిగింది. ఇది చొరబాటుదారుల ప్రభుత్వం. JMMను తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఎవరూ సురక్షితంగా ఉండరు. ప్రజలు బాధ్యతగా వారిని గద్దెదించాలి’ అని శర్మ పిలుపునిచ్చారు.
Similar News
News November 1, 2024
ఆ దేశంలో విడాకుల రేటు 94%?
ప్రపంచంలోనే అత్యధికంగా పోర్చుగల్‌లో విడాకుల రేటు 94%గా ఉన్నట్లు ఓ స్టడీ తెలిపింది. ఆ తర్వాత స్పెయిన్ (85%), లక్సెంబర్గ్ (79%), రష్యా (73%), ఉక్రెయిన్ (70%), క్యూబా (55%), ఫిన్‌లాండ్ (55%), బెల్జియం (53%), ఫ్రాన్స్ (51%), నెదర్లాండ్స్ (48%), కెనడా (47%), యూఎస్ (45%), చైనా (44%), యూకే (41%), జర్మనీ (38%), టర్కీ (25%), ఈజిప్టు (17%), ఇరాన్ (14%), తజికిస్థాన్ (10%), వియత్నాం (7%), ఇండియా (1%) ఉన్నాయి.
News November 1, 2024
దేవాలయాల ఆస్తుల రక్షణకు కార్యాచరణ
AP వ్యాప్తంగా దేవాలయాలు, ధర్మసత్రాల ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేవదాయ శాఖ పరిధిలో ఆక్రమణలు, అన్యాక్రాంతమైన భూముల వివరాలు తెలియజేయాలని ఆ శాఖ కమిషనర్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వక్ఫ్ ఆస్తుల రక్షణ తరహాలో కార్యాచరణ రూపొందించాలన్నారు. ఐ.ఎస్.జగన్నాథపురం <<14505508>>ఆలయం<<>> 50 ఎకరాల భూమి రక్షణ కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ కొండ తవ్వకంపై విచారణకు ఆదేశించారు.
News November 1, 2024
గాజాలో 64 మంది, లెబనాన్‌లో 24 మంది మృతి
హమాస్, హెజ్బొల్లాతో కాల్పుల విరమణ అవకాశాలను కొట్టిపారేస్తూ ప్రత్యర్థులపై ఇజ్రాయెల్ విచుకుపడింది. గాజా మధ్య, దక్షిణ భాగాలే లక్ష్యంగా శుక్రవారం జరిపిన దాడుల్లో 64 మృతి చెందారు. దీర్ అల్-బలహా, నుసెరాత్ శిబిరం, అల్-జవైదా పట్టణం వంటి ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. మరోవైపు లెబనాన్ రాజధాని బీరూట్ దక్షిణ ప్రాంతమైన దహియె, దేశ ఉత్తర ప్రాంతాలపై IDF జరిపిన దాడిలో 24 మంది మృతి చెందారు.