News November 1, 2024
రూపాయి: విలువ కంటే ఖర్చెక్కువ!

నిత్యం మనం వినియోగించే కరెన్సీ తయారీకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఒక రూపాయి నాణెం తయారు చేయడానికి ₹1.11 ఖర్చు అవుతుంది. ఇది నాణెం విలువ కంటే ఎక్కువ. రెండు రూపాయల నాణేనికి ₹1.28, 5 రూపాయల నాణేనికి ₹3.69 ఖర్చవుతుంది. రూ.10 నోట్ల ముద్రణకు ₹0.96, ₹20కి ₹0.95, రూ.50కి ₹1.13, ₹100కి ₹1.77 ఖర్చవుతుంది. UPI వినియోగం అధికంగా ఉన్నప్పటికీ దేశంలో ఇప్పటికీ ₹34.7 లక్షల కోట్ల నగదు సర్క్యులేషన్‌లో ఉంది.
Similar News
News February 20, 2026
TG EDCET-2026 నోటిఫికేషన్ విడుదల

TG: రాష్ట్రంలో రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు TG EDCET-2026 నోటిఫికేషన్ రిలీజైంది. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో CBT విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 22 వరకు అవకాశం ఉంది. మే 12వ తేదీ 2 సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది. కనీసం 50 మార్కులతో బ్యాచ్‌లర్ డిగ్రీ ఉన్నవాళ్లే అప్లై చేసుకునేందుకు అర్హులు.
News February 20, 2026
టెన్త్ స్టూడెంట్ల పేర్లలో తప్పుల సవరణకు ఛాన్స్

AP: టెన్త్ విద్యార్థుల పేర్లు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్, జెండర్ వివరాల్లో తప్పులుంటే స్కూళ్ల ఐడీల ద్వారా HMలు ఈనెల 21లోపు సరిచేయాలని బోర్డు సూచించింది. బోర్డు అందించే లింకుల్లో వీటిని సమర్పించాలంది. కరెక్షన్స్‌ను విద్యార్థులు, పేరెంట్స్ కూడా సరిచూసుకోవాలని పేర్కొంది. ఈ పరీక్షలకు 6 లక్షల మంది హాజరుకానున్నారు.
News February 20, 2026
ఆస్తి పంపకాలలో వాస్తు సూచనలు

కుటుంబంలో ఆస్తి పంపకాలప్పుడు మనస్పర్థలు రాకుండా ఉండేందుకు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు కొన్ని సూచనలు చేశారు. అవి.. ఖాళీ స్థలాల విభజనలో తూర్పు, ఉత్తరం దిశల్లో చిన్నవారు ఉండాలి. పడమర, దక్షిణం దిశల్లో పెద్దవారు ఉండాలి. ఈ పద్ధతిని అనుసరిస్తే సోదరుల మధ్య ఐక్యత దెబ్బతినదు. ఇలా శాస్త్రోక్తంగా దిశలు కేటాయిస్తే అనవసర తగాదాల తగ్గుతాయి. ఇలా కుటుంబంలో ప్రశాంతతను, ఆర్థికాభివృద్ధిని పెంపొందించుకోవచ్చు. <<-se>>#Vasthu<<>>


