News November 1, 2024

టీటీడీ పాలకమండలిలో మరికొందరికి చోటు

image

AP: బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా 24 మందితో ఏర్పాటైన టీటీడీ పాలకమండలిలో ప్రభుత్వం మరో ఐదుగురికి చోటు కల్పించింది. జి.భాను ప్రకాశ్ రెడ్డిని సభ్యుడిగా, దేవదాయ శాఖ సెక్రటరీ, కమిషనర్, TUDA ఛైర్మన్, TTD ఈవోలను ఎక్స్‌అఫిషియో మెంబర్లుగా పాలకమండలిలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం జీవో జారీ చేసింది.

Similar News

News December 31, 2025

అతిపెద్ద జిల్లాగా కడప

image

ఏపీలో జిల్లాల పునర్విభజనతో విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా కడప నిలిచింది. గతంలో అనంతపురం తొలి స్థానంలో ఉండేది. రాజంపేట నియోజకవర్గం జిల్లాలో చేరడంతో 12,507 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో భూభాగ పరంగా మొదటి, 22.96 లక్షల ప్రజలతో జనాభా పరంగా రెండోస్థానంలో ఉందని అధికారులు తెలిపారు. జనాభా పరంగా చూస్తే 3,49,953 మందితో పోలవరం చివరి స్థానంలో ఉండే అవకాశముంది. కొత్త జిల్లాలపై పూర్తి గణాంకాలు తెలియాల్సి ఉంది.

News December 31, 2025

వొడాఫోన్ ఐడియాకు భారీ ఊరట.. ₹87,695 కోట్ల బకాయిలు ఫ్రీజ్!

image

వొడాఫోన్ ఐడియా (Vi)కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కంపెనీ చెల్లించాల్సిన ₹87,695 కోట్ల AGR బకాయిలను ప్రస్తుతానికి నిలిపివేస్తూ ఐదేళ్ల పాటు మారటోరియం ప్రకటించింది. ఈ బకాయిలను 2031 నుంచి పదేళ్ల కాలంలో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది. టెలికం రంగంలో పోటీని కాపాడటానికి 20 కోట్ల మంది కస్టమర్ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో కంపెనీ ఆర్థిక కష్టాల నుంచి కోలుకునే అవకాశం ఉంది.

News December 31, 2025

పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు

image

పాడి పశువులకు సోకే వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి చాలా ప్రమాదకరమైనది. పశువుల షెడ్‌లోని అపరిశుభ్ర వాతావరణం, యాజమాన్య లోపాల వల్ల పాలిచ్చే పశువులకు ఇది సోకే అవకాశం ఎక్కువ. పొదుగు వాచిపోవడం, పాలు నీరులా మారడం, విరగడం, అందులో తెల్లటి ముక్కలు కనిపించడం, పశువులు పాలు పిండనీయకపోవడం వంటి లక్షణాలను బట్టి పశువుల్లో ఈ వ్యాధిని గుర్తించవచ్చు. పొదుగువాపు వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గుతుంది.