News November 2, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

✔MBNR:లా,ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు పట్ల పలువురు హర్షం
✔భక్తులతో కిటకిటలాడిన కురుమూర్తి దేవాలయం
✔కిష్టంపల్లి: ముళ్లపొదలో పసికందు.. ఆసుపత్రికి తరలింపు
✔NGKL: డెంగ్యూతో బాలుడి మృతి
✔MBNR: 4న ఉమ్మడి జిల్లా స్థాయి యోగా ఎంపికలు
✔పలుచోట్ల దీపావళి వేడుకలు
✔మహమ్మదాబాద్: ఘనంగా మాజీ మంత్రి కమతం రాంరెడ్డి జయంతి వేడుకలు
✔పకడ్బందీగా కుటుంబ సర్వే: కలెక్టర్లు
✔కురుమూర్తి ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
Similar News
News April 7, 2026
MBNR: ఆ పదవికి ఫుల్ డిమాండ్.!

MBNR జిల్లాలోని 16 మండలాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవుల నియామకంపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తి కావడంతో, తమ జిల్లా తుది జాబితా ఎప్పుడు విడుదలవుతుందా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఈ పదవులకు భారీగా పోటీ ఏర్పడింది. మండల స్థాయిలో పట్టు సాధించేందుకు ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News April 7, 2026
MBNR: సల్కార్‌పేటలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్‌నగర్ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కార్‌పేటలో 40.4 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. దేవరకద్ర 39.9, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 39.6, చిన్న చింతకుంట 39.4, అడ్డాకుల 39.3, మిడ్జిల్ మండలం దోనూరు, నవాబుపేట 39.2, కౌకుంట్ల, కోయిలకొండ మండలం పారుపల్లి 38.9, భూత్పూర్ 38.8, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 38.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News April 6, 2026
ప్రజావాణి.. ప్రజల వినతులకు తక్షణ స్పందన: MBNR ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి (Grievance Day) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. ప్రతి దరఖాస్తును జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలు అందించడం పోలీస్ శాఖ ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు.


