News November 2, 2024
14 నుంచి వార్డెన్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
TG: సంక్షేమ హాస్టళ్లలో వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్ తదితర పోస్టుల భర్తీకి ఈ నెల 14 నుంచి 30 వరకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఉ.10.30 నుంచి సా.5 వరకు నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో పరిశీలన ఉంటుందన్నారు. అనివార్య కారణాలతో హాజరుకాలేని వారికి డిసెంబర్ 2-4 రిజర్వుడేగా ప్రకటించామన్నారు. మొత్తంగా 581 పోస్టులకు నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
వెబ్‌సైట్: https://www.tspsc.gov.in/
Similar News
News November 2, 2024
INDvsNZ: రెండో రోజు ఆట ప్రారంభం
వాంఖడే వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. 86/4 స్కోర్‌తో తొలి రోజు ఆట ముగించిన భారత్ ఇంకా 149 పరుగులు వెనకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో గిల్(31), పంత్(1) ఉన్నారు. అటు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 235 రన్స్ చేసిన విషయం తెలిసిందే. కాగా భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కివీస్ స్కోర్‌ను సమం చేసి, లీడ్ సాధించాలంటే భారీ భాగస్వామ్యం అవసరం.
News November 2, 2024
విశాఖ- విజయవాడ మధ్య 16 జనసాధారణ్ రైళ్లు
AP: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా విశాఖపట్నం- విజయవాడ మధ్య 16 జన్‌సాధారణ్ రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో పూర్తిగా అన్‌రిజర్వుడు బోగీలు ఉంటాయి. నవంబర్ 3, 4, 6, 8, 10, 11, 13 తేదీల్లో వీటిని నడపనున్నారు. దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరంలో హాల్టింగ్ ఉంటుంది.
News November 2, 2024
మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
AP: నెల్లూరు జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవానికి భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు చేశారని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని వెంకటాచలం మండల టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్వేషాలను రెచ్చగొట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కాకాణిపై కేసు నమోదు చేసినట్లు సీఐ సుబ్బారావు తెలిపారు.