News November 2, 2024
వరంగల్ జిల్లాలో వర్షం.. రైతుల ఆందోళన
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల రెండు రోజులుగా వర్షం దంచికొడుతోంది. దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బుట్టాయిగూడెం, చింతగూడెం, సింగారం, లక్ష్మీపురం గ్రామాల్లో గాలివాన కారణంగా వరి పంట నేల వాలింది. మిర్చి మొక్కలు నీట మునిగి, నీరు నిల్వ ఉండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. పంట కోసి కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 26, 2024
డాక్టర్లు అందుబాటులో ఉన్నారు: DMHO
హనుమకొండ జిల్లా ఆత్మకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని DMHO డాక్టర్ అప్పయ్య సందర్శించారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల కోసం నిర్వహిస్తున్న సేవలను పరిశీలించి స్వయంగా వారికి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వం అందించే వైద్య సౌకర్యాలను వినియోగించుకోవాలని సూచించారు. అక్కంపేట, పెద్దాపూర్ పల్లె దవాఖానాల్లో డాక్టర్లు అందుబాటులో ఉన్నారని.. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
News December 26, 2024
HNK: సిద్దేశ్వరునికి అన్నాభిషేకం
హనుమకొండ జిల్లా కేంద్రంలోని సిద్దేశ్వర ఆలయంలో మార్గశిర మాసం గురువారం ఏకాదశి సందర్భంగా సిద్దేశ్వరునికి అన్నాభిషేకం, చెరుకుతో మహనివేదన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిద్దేశ్వరుడిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.
News December 26, 2024
వరంగల్ జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
క్రిస్మస్ వేడుకలతో ఉమ్మడి వరంగల్ జిల్లా దద్దరిల్లింది. నగరంతో పాటు.. జిల్లాలోని పలు చర్చిల్లో పాస్టర్లు ప్రార్థనలు చేసి ఏసుక్రీస్తు చూపిన మార్గంలో అంతా నడవాలని సూచించారు. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని జీసస్ పాటలు పాడుతూ సంబరాలు జరుపుకున్నారు. చర్చ్‌లతో పాటు.. నగరం అంతా దీపాల వెలుగులతో నింపేశారు. కాగా, క్రిస్మస్ మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి.