News November 2, 2024
కావలిలో ఉద్రిక్తత
కావలిలో ప్రయాణికుడిపై డ్రైవర్ చేయి చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. లాజర్ అనే ప్రయాణికుడు మద్యం తాగి బస్సు ఎక్కే ప్రయత్నం చేయగా డ్రైవర్ అడ్డుకున్నాడు. తాగి బస్సు ఎక్కకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈక్రమంలో డ్రైవర్ తనను కొట్టడంతో పన్ను విరిగి నోటి నిండా రక్తస్రావమైందని లాజర్ ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 26, 2024
వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామికి పూజలు
రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, నరసింహ యాగం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం స్వామి అమ్మవార్లకు కల్యాణ కార్యక్రమం వేద పండితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
News December 26, 2024
REWIND: నెల్లూరులో జలప్రళయానికి 20 మంది బలి
సునామీ ఈ పేరు వింటేనే నెల్లూరు జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. సరిగ్గా20 ఏళ్ల క్రితం 2004 డిసెంబర్ 26న నెల్లూరు జిల్లాలో సునామీ పంజా విసిరింది. ఈ ధాటికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 20మంది మృతి చెందారు. కళ్లెదుటే కుటుంబ సభ్యులను పోగుట్టుకున్న పరిస్థితులను ఇప్పుడు తలచుకున్నా ఆ భయం అలానే ఉందని నెల్లూరు వాసులు పేర్కొంటున్నారు.
News December 26, 2024
నెల్లూరు జిల్లాలో చలిగాలులతో వణుకుతున్న ప్రజలు
అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా ప్రజలు చలిగాలులతో వణుకుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ముసురు పట్టి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో గత రెండు రోజులుగా చలిగాలుల తీవ్రత ఎక్కువైంది. దీంతో వృద్ధులు పిల్లలతో పాటు సాధారణ ప్రజలు కూడా చలికి గజగజ వణికి పోతున్నారు.