News November 2, 2024
కార్తీకమాసం ఆరంభం
నేటి నుంచి కార్తీకమాసం ప్రారంభమైంది. పరమశివుడికి, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో పూజలు చేయడం ఎంతో శ్రేయస్కరమని పండితులు చెబుతున్నారు. పూజలు, వ్రతాలు, ఉపవాసాలు, వనభోజనాలతో సందడిగా ఉంటుంది. ఈ మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో సంచరించడం వల్ల కార్తీక మాసం అనే పేరు వచ్చింది. ఈ నెలలో పవిత్ర నదుల్లో బ్రహ్మముహూర్తంలో స్నానం చేయడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
Similar News
News November 2, 2024
హిందు, ముస్లింలను ఒకేలా చూడాలి: ఒవైసీ
తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలని TTD ఛైర్మన్ BR.నాయుడు అనడంపై MIM MP అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘TTDలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఛైర్మన్ అంటున్నారు. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులు ఉండటాన్ని తప్పనిసరి చేయాలనుకుంటోంది’ అని ఒవైసీ ట్వీట్ చేశారు. హిందువులను, ముస్లింలను ఒకేలా చూడాలని అభిప్రాయపడ్డారు.
News November 2, 2024
కులగణనతో బీసీల్లో పెనుమార్పులు: మంత్రి పొన్నం
TG: కులగణనతో బీసీల్లో పెనుమార్పులు రాబోతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ, హైకోర్టు ఉత్తర్వుల మేరకే కులగణన చేస్తున్నామని చెప్పారు. స్థానిక సంస్థలు, ఇతర రంగాల రిజర్వేషన్లపై ఆలోచన చేస్తున్నామని, DECలో సర్వే నివేదికను ప్రభుత్వం ముందు ఉంచుతామని తెలిపారు. కులగణనపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
News November 2, 2024
కులగణన.. ప్రశ్నలు ఇవే!
TG: నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఇందుకోసం 75 ప్రశ్నలను సిద్ధం చేశారు. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకోరు. సర్వే టైంలో కుటుంబ యజమాని ఒకరు ఉంటే సరిపోతుంది.