News November 2, 2024

ఆస్ట్రేలియా Aతో మ్యాచ్.. సాయి సుదర్శన్ సెంచరీ

image

ఆస్ట్రేలియా A జరుగుతోన్న మ్యాచులో ఇండియా A ఆటగాడు సాయి సుదర్శన్ మెరిశారు. ఓపెనర్లు రుతురాజ్, అభిమన్యు ఈశ్వరన్ విఫలం కాగా సుదర్శన్ సెంచరీ చేశారు. మరో యువ బ్యాటర్ పడిక్కల్ 88 పరుగులతో రాణించారు. ఇషాన్ కిషన్ 32, నితీశ్ కుమార్ రెడ్డి 17 రన్స్ చేసి ఔటయ్యారు. ప్రస్తుతం ఇండియా A 199 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Similar News

News December 31, 2025

నా కూతురికి యాక్టర్ కావాలని లేదు: రోజా

image

తన కూతురు అన్షు భవిష్యత్తుపై నటి, మాజీ మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. ‘అన్షుకు యాక్టర్ కావాలనే కోరిక లేదు, సైంటిస్ట్ కావాలనుకుంటోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారించింది. పిల్లలకు భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛను ఇచ్చాను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్టార్ హీరో కొడుకుతో అన్షు పెళ్లిపై స్పందిస్తూ.. ‘ఆ హీరో ఎవరో చెబితే తెలుసుకుంటా’ అని నవ్వుతూ జవాబిచ్చారు.

News December 31, 2025

టెన్త్ అర్హతతో 25,487పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

కేంద్ర బలగాల్లో <>25,487<<>> కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్ పాసై, 18-23సం.ల మధ్య వయస్సు గల వారు అర్హులు. మొత్తం పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో 1,105 ఉన్నాయి. BSF, ITBP, SSB, CRPF, SSF, AR, CISF విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. PST/PET, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి, ఏప్రిల్ 2026లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. https://ssc.gov.in/

News December 31, 2025

జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ

image

AP: రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాస్‌పుస్తకాలను రైతులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏమైనా తప్పులు గుర్తిస్తే సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. ఊరూరా రెవెన్యూ గ్రామసభల ద్వారా పంపిణీ జరగనుంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తేదీలను ఖరారు చేశారు.