News November 2, 2024
HYD: GET READY.. 21 వేల మందితో సర్వే!

గ్రేటర్ HYDలో సకుటుంబ సర్వేకు సర్వం సిద్ధమైంది. ఈ సర్వేలో గ్రేటర్ వ్యాప్తంగా 21 వేల ఎన్యుమరేటర్లు, రిసోర్స్ పర్సన్లు, సూపర్‌వైజర్లు పాల్గొంటారని మున్సిపల్ & అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్ గౌరీ శంకర్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఆయన పాల్గొన్నారు.ఈ నెల 6 నుంచి సర్వే ప్రారంభం కానుండగా.. 100 శాతం ఖచ్చితత్వంతో నిర్వహించాలని ఆదేశించారు.
Similar News
News December 31, 2025
31st నైట్ HYDలో ఈ రూట్లు బంద్

New Year వేడుకల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, PV మార్గ్, పలు ఫ్లైఓవర్‌లను పూర్తిగా నిలిపివేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.
News December 31, 2025
HYD: ఈ చేపలు తింటే ముప్పు

మేడ్చల్ (D) ఎదులాబాద్ నీటి రిజర్వాయర్ కాలుష్యంతో తీవ్రంగా కలుషితమవుతోంది. ఇందులోని చేపలు ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్నాయి. తక్కువ ధర, అధిక ప్రోటీన్ అనే కారణాలతో ప్రజలు విస్తృతంగా తినే పొలుసులు చేపల్లో విషం దాగి ఉంది. సీసం, క్రోమియం, నికెల్, కాడ్మియం వంటి భార లోహాలు పేరుకుపోయినట్లు TG SSC జీవశాస్త్ర పాఠ్యపుస్తకంలోనే స్పష్టంగా పేర్కొన్నారు. దీర్ఘ కాలంలో కాలేయం, కిడ్నీ, నరాలపై ప్రభావం చూపనుంది.
News December 31, 2025
HYD: New Year.. 9490616555 కాల్ చేయండి

న్యూ ఇయర్ సంబరాల్లో సామాన్యులను ఇబ్బంది పెట్టే క్యాబ్, ఆటో డ్రైవర్ల ఆటకట్టించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. రైడ్ నిరాకరణ, అదనపు వసూళ్లపై ఫిర్యాదులు వస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనం నంబరు, సమయం తదితర ఆధారాలతో 9490616555 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 178(3)(b) ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


