News November 2, 2024
ప్రకాశం: ‘పల్లె పండుగ పనులు పూర్తి కావాలి’

ప్రకాశం జిల్లాలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా చేపట్టే సి.సి రోడ్లు, సైడ్ డ్రెయిన్ పనులు డిసెంబర్ లోగా పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ అధికారులతో సమావేశమై, పల్లె పండుగ కార్యక్రమంలో మంజురైన 1140 కొత్త పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు, డ్వామా, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు కూడా ఉన్నారు.
Similar News
News September 15, 2025
మోక్షగుండం విశ్వేశ్వరయ్య మన జిల్లా వాసే

నేడు ఇంజనీర్స్ డే. దేశమంతా మోక్షగుండం విశ్వేశ్వరయ్యను స్మరిస్తుంది. ఇంజినీర్లందరూ ఆయనే ఆదర్శమని గర్వంగా చెబుతుంటారు. ఆయన జయంతి సందర్భంగానే ఇంజినీర్స్ డేను జరుపుకుంటారు. విశ్వేశ్వరయ్య పూర్వీకులు బి.పేట మండలంలోని మోక్షగుండం వాసులే. ఈయనను మోక్షగుండం ప్రజలు నేటికీ ఆరాధిస్తారు. ముంబై, పూణే, హైదరాబాద్‌లో వంతెనలు నిర్మించి వరదల నుంచి కాపాడిన ఘనత ఈయన సొంతం.
News September 15, 2025
పూర్వ ఎస్పీ దామోదర్‌కు ఘనంగా వీడ్కోలు

ఒంగోలులోని జిల్లా పోలీస్ కళ్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం ఎస్పీ దామోదర్‌కు వీడ్కోలు సభను జిల్లా పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ సంధర్భంగా ఎస్పీ దామోదర్ జిల్లాకు అందించిన సేవలను పలువురు పోలీస్ అధికారులు కొనియాడారు. అనంతరం ఎస్పీ దామోదర్‌ను పోలీస్ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News September 14, 2025
ఒంగోలు MP మాగుంటకు రెండవ ర్యాంక్

2024-25వ సంవత్సరానికి సంబంధించి లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల పనితీరు నివేదికను పార్లమెంట్ ప్రతినిధులు ఆదివారం విడుదల చేశారు. ఈ నివేదికలో ఒంగోలు MP మాగుంట శ్రీనివాసులురెడ్డి 2వ స్థానంలో నిలిచారు. ఆయన లోక్‌సభలో మొత్తం 84 ప్రశ్నలు అడగటంతోపాటు 6 చర్చల్లో పాల్గొన్నారు. కాగా ఆయన హాజరు 73.53 శాతంగా ఉంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకును కేటాయించినట్లు పార్లమెంట్ వర్గాలు వెల్లడించాయి.