News November 2, 2024
MBNR: ఓపెన్ DEGREE, PG.. మరో అవకాశం

డా. బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరడానికి నవంబర్ 15 వరకు గడవు పొడిగించినట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. వర్సిటీలో చేరిన ద్వితీయ,తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ ఫీజు, అంతకు ముందు వర్సిటీలో చేరి ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులు సైతం నవంబరు 15వ తేదీలోపు ట్యూషన్ ఫీజును www.braou.ac.in ఆన్‌లైన్‌లో చెల్లించాలని పేర్కొన్నారు.
Similar News
News March 15, 2026
బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలి: మాజీ మంత్రి

హైదరాబాద్ లక్డికపూల్‌లోని సెంట్రల్ కోర్ట్ హోటల్‌లో నిర్వహించిన బీసీ సంఘాలు- ప్రజాప్రతినిధుల సమావేశంలో మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా, ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌లలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు.
News March 15, 2026
MBNR: మొబైల్ లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం

తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్ జిల్లాలో న్యాయ సేవలను మరింత విస్తరించేందుకు 2 మొబైల్ లోక్ అదాలత్ వాహనాలను కొనుగోలు చేసింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత మాట్లాడుతూ.. ఈ వ్యాన్లు ప్రతినెల రోటేషన్ పద్ధతిలో జిల్లాలకు పంపి లిటరసీ క్యాంపులు, లీగల్ సర్వీసెస్ జైలు సందర్శనలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
News March 14, 2026
సీసీకుంట: “వెయ్యేళ్ల కురుమూర్తి కొండలను కాపాడండి”

చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామంలో క్రషర్ మైనింగ్‌కు అనుమతి ఇవ్వవద్దని స్థానిక రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దేవాలయం పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కార్యకలాపాలు జరిగితే పర్యావరణానికి, వ్యవసాయానికి, భక్తుల భావాలకు నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే మైనింగ్ అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.


