News November 2, 2024
69% కుటుంబాలపై కాలుష్య ప్రభావం
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. నగరంలోని 69% కుటుంబాల్లోని ఎవరో ఒకరు కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పొల్యూషన్ సర్వేలో తేలింది. కాలుష్య స్థాయులు పెరగడం వల్ల కళ్లలో మంట, శ్వాసలో ఇబ్బందులు వస్తున్నట్లు వెల్లడైంది. దీపావళి రోజు రాత్రి ఢిల్లీతో పాటు NCRలోని పలు ప్రాంతాల్లో AQI 999కి చేరుకుంది. అటు యమునా నదిలో సైతం కాలుష్యం వల్ల భారీ స్థాయిలో నురగలు ఏర్పడ్డాయి.
Similar News
News November 2, 2024
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానికంగా వీరి కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక విదేశీ ఉగ్రవాది సహా మరొకరు మృతి చెందారు. శ్రీనగర్ ఖాన్యార్‌లో ఎదురు కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే ఈ ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం నుంచి వ్యాలీలో నాలుగు ఉగ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి.
News November 2, 2024
సిమెంట్ నేర్పే జీవిత పాఠం!
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటుంటారు. తాజాగా నిర్మాణాలకు వినియోగించే సిమెంట్ కూడా జీవిత పాఠాన్ని బోధిస్తుందని ఆయన తెలిపారు. ‘ఏదైనా సృష్టించడానికి మీరు మృదువుగా, సరళంగా ఉండాలి. అయితే దీనిని నిలబెట్టుకోడానికి మీరు దృఢంగా మారాల్సి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్?
News November 2, 2024
బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా: CBN
AP: ఇసుక, మద్యం విషయంలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఉచిత ఇసుకలో ఎక్కడా రాజీ లేదని, దొంగతనంగా వ్యాపారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ పెడతామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యంపై ఇష్టానుసారం రేట్లు పెంచితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.