News November 2, 2024
కులగణన.. ప్రశ్నలు ఇవే!
TG: నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఇందుకోసం 75 ప్రశ్నలను సిద్ధం చేశారు. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకోరు. సర్వే టైంలో కుటుంబ యజమాని ఒకరు ఉంటే సరిపోతుంది.
Similar News
News November 2, 2024
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం
అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. స్థానికంగా వీరి కదలికలపై సమాచారం అందుకున్న బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక విదేశీ ఉగ్రవాది సహా మరొకరు మృతి చెందారు. శ్రీనగర్ ఖాన్యార్‌లో ఎదురు కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే ఈ ఎన్కౌంటర్ జరిగింది. శుక్రవారం నుంచి వ్యాలీలో నాలుగు ఉగ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి.
News November 2, 2024
సిమెంట్ నేర్పే జీవిత పాఠం!
ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంటుంటారు. తాజాగా నిర్మాణాలకు వినియోగించే సిమెంట్ కూడా జీవిత పాఠాన్ని బోధిస్తుందని ఆయన తెలిపారు. ‘ఏదైనా సృష్టించడానికి మీరు మృదువుగా, సరళంగా ఉండాలి. అయితే దీనిని నిలబెట్టుకోడానికి మీరు దృఢంగా మారాల్సి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. దీనిపై కామెంట్?
News November 2, 2024
బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తా: CBN
AP: ఇసుక, మద్యం విషయంలో అక్రమాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఉచిత ఇసుకలో ఎక్కడా రాజీ లేదని, దొంగతనంగా వ్యాపారం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. అక్రమార్కులపై పీడీ యాక్ట్ పెడతామని స్పష్టం చేశారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానని, మద్యంపై ఇష్టానుసారం రేట్లు పెంచితే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చారు.