News November 2, 2024

MBNR: పెళ్లిళ్ల సీజన్ షురూ.. డిసెంబర్ వరకు ముహూర్తాలే!

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. నవంబర్‌లో 3,7,8,9,10,13,14,15,16,17, డిసెంబర్‌లో 5,6,7,8,9,11,13, 14,15,18, 26 తేదీల్లో పెళ్లికి ఈ రెండు నెలల్లో 21 రోజులు మంచి ఘడియలు ఉన్నట్టు పురోహితులు తెలిపారు. ఇప్పటికే పెళ్లిళ్ల కోసం ఫంక్షన్‌హాళ్లు బుకింగ్‌లు మొదలయ్యాయి.

Similar News

News November 10, 2025

MBNR:FREE కోచింగ్.. అప్లై చేస్కోండి

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని యువకులకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ ‘Way2News’తో తెలిపారు. ‘జూనియర్ బ్యూటీ పార్లర్ ప్రాక్టీషనర్’లో ఉచిత శిక్షణ, వసతి ఇస్తున్నామని, వయసు 19-45లోపు ఉండాలని, ఆసక్తి గలవారు. SSC MEMO, రేషన్, ఆధార్‌కార్డ్, కుల ధ్రువీకరణ పత్రం, 3 ఫొటోలతో ఈనెల 12లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు.

News November 10, 2025

MBNR: సాఫ్ట్‌బాల్.. 2nd PLACE

image

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్‌లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్‌గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.

News November 9, 2025

BREAKING.. MBNR: ట్రాక్టర్, ఆటో ఢీ.. మహిళ మృతి

image

మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి-మల్లాపూర్ రోడ్డులో ఆటోను పత్తి లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో మల్లాపూర్‌కు చెందిన వడ్డే మల్లీశ్వరి (21) అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాలు.. HYD నుంచి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతురాలికి ఆరు నెలల వయసున్న కవల పిల్లలు (బాలుడు, బాలిక) ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.