News November 2, 2024

హిందు, ముస్లింలను ఒకేలా చూడాలి: ఒవైసీ

image

తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలని TTD ఛైర్మన్‌ BR.నాయుడు అనడంపై MIM MP అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘TTDలో కేవలం హిందువులు మాత్రమే ఉండాలని ఛైర్మన్ అంటున్నారు. అయితే మోదీ ప్రభుత్వం మాత్రం వక్ఫ్ బోర్డులు, వక్ఫ్ కౌన్సిల్‌లో ముస్లిమేతరులు ఉండటాన్ని తప్పనిసరి చేయాలనుకుంటోంది’ అని ఒవైసీ ట్వీట్ చేశారు. హిందువులను, ముస్లింలను ఒకేలా చూడాలని అభిప్రాయపడ్డారు.

Similar News

News October 15, 2025

శ్రీశైలంలో హైఅలర్ట్.. రాకపోకలపై ఆంక్షలు

image

AP: రేపు <<17979325>>PM మోదీ<<>> శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బందోబస్తు కట్టుదిట్టం చేశారు. 1800మంది పోలీసులు, సిబ్బందితో మూడంచెల భద్రతా వలయం ఏర్పాటు చేశారు. రేపు ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. భక్తులు దీనికి తగిన విధంగా తమ ప్లాన్స్ మార్చుకోవాలని జిల్లా కలెక్టర్, SP సూచించారు.

News October 15, 2025

‘X’లో కొత్త సెక్యూరిటీ ఫీచర్లు

image

తమ ప్లాట్‌ఫామ్‌లో కంటెంట్ అథెంటిసిటీ కోసం కొత్త ఫీచర్లు తీసుకురానున్నట్లు ‘X’ వెల్లడించింది. ముఖ్యంగా మీరు కంటెంట్ చూస్తున్న అకౌంట్ ఏ దేశం నుంచి ఆపరేట్ అవుతోందో డిస్‌ప్లే చేస్తారు. వాళ్లు ‘X’లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్నిసార్లు యూజర్ నేమ్ ఛేంజ్ చేశారు, ఎలా కనెక్ట్ అయ్యారు అనే విషయాలు ప్రదర్శిస్తారు. త్వరలోనే దీనిని అందుబాటులోకి తెస్తామంది. ఇలాంటి అప్‌డేట్స్ మరెన్నో రాబోతున్నట్లు తెలిపింది.

News October 15, 2025

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైన ‘కన్నప్ప’

image

మంచు విష్ణు, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన ‘కన్నప్ప’ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీలో ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, శరత్ కుమార్ నటించిన విషయం తెలిసిందే. దీపావళి సందర్భంగా ఈ మూవీని జెమినీలో అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు ప్రీమియర్‌గా ప్రదర్శించబోతోన్నారు.