News November 2, 2024

RECORD: ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన పంత్

image

భారత బ్యాటింగ్ సెన్సేషన్ పంత్ అరుదైన రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 36 బంతుల్లోనే 50 రన్స్ కొట్టారు. దీంతో NZపై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ క్రికెటర్‌గా నిలిచారు. దీంతో జైస్వాల్(పుణేలో 41బంతుల్లో) రికార్డు బ్రేకయ్యింది. కాగా ఆ తర్వాత నెమ్మదించిన పంత్ 59 బంతుల్లో 60 రన్స్ చేసి ఔటయ్యారు. అందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.

Similar News

News February 16, 2026

TGలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక అప్డేట్స్

image

* నిజామాబాద్ మేయర్‌‌గా ఉమారాణి(కాంగ్రెస్)
* కరీంనగర్ మేయర్‌గా కొలగాని శ్రీనివాస్(బీజేపీ)
* నల్గొండ మేయర్‌గా బుర్రి చైతన్య(కాంగ్రెస్)
* ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
* కోరం లేకపోవడంతో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక వాయిదా
* అలియాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా కంఠం శిరీష(కాంగ్రెస్)

News February 16, 2026

మహిళలూ ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?

image

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్‌లో ప్రయాణించడం ఎక్కువైంది. ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, లైసెన్స్ ప్లేట్ మీరు బుక్ చేసిన డేటాతో సరిపోలాలి. ట్రిప్ వివరాలు, లైవ్ ట్రాకింగ్‌ సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు గమనిస్తూ అలర్ట్‌గా ఉండాలి. వెనుక సీట్‌లోనే కూర్చోవాలి. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.

News February 16, 2026

విప్ ఇద్దామంటే BRSకు దొరకని ఆ MLAలు

image

TG: హంగ్ ఏర్పడ్డ మున్సిపాల్టీల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా MLA, MLC, MP ఓట్లు కీలకంగా మారడంతో పార్టీలు వారికి విప్ జారీ చేస్తున్నాయి. వాటిని వ్యక్తిగతంగా అందించి సంతకాలు కూడా తీసుకోవాలి. BRSకు ఇదే తలపోటుగా మారింది. INCకి సన్నిహితంగా ఉంటున్న MLAలకు విప్ ఇద్దామంటే పార్టీకి వారెవరూ అందుబాటులో లేరు. వారెవరూ విప్ అందుకోలేదు. గద్వాల వంటి చోట్ల BRS MLAనే INC అభ్యర్థిని ఛైర్మన్ సీట్లో కూర్చోబెట్టారు.