News November 2, 2024

సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు: సీఎం చంద్రబాబు

image

వెన్నెలపాలెంలోని సభలో CM చంద్రబాబు రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితిపై మాట్లాడారు. పరవాడ జంక్షన్ స్ఫూర్తిగా సంక్రాతి నాటికి రాష్ట్రాన్ని గుంతలు లేని రోడ్లుగా మార్చాలని R&B మంత్రికి సూచించారు. YCP ఐదేళ్లలో రహదారులను పట్టించుకోకపోవడంతో ఎక్కడికక్కడ గుంతలు పడ్డాయన్నారు. ఈ రోడ్లు చూశాక గర్భిణీలకు ఆస్పత్రికి వెళ్లే పనిలేకుండా రోడ్లపైనే డెలివరీ అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

Similar News

News September 13, 2025

విశాఖలో 15 రోజులపాటు HIV/AIDSపై అవగాహన

image

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 15 రోజులపాటు విశాఖ జిల్లా పాఠశాలల్లో విద్యార్థులకు HIV/AIDS, లైంగిక వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐఈసీ కాంపెయిన్ల ద్వారా జాగ్రత్తలు, చికిత్సా అవకాశాలు, గర్భిణులకు కౌన్సెలింగ్, హెల్ప్‌లైన్ 1097 సేవలు అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎ.నాగేశ్వరరావు తెలిపారు.

News September 13, 2025

విశాఖ: బీజేపీ సభ ఏర్పాట్ల పరిశీలన

image

విశాఖ రైల్వే మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం జరగనున్న బహిరంగ సభ ప్రాంతాన్ని మంత్రి సత్య కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్.మాధవ్ పరిశీలించారు. జేపీ నడ్డా హాజరవుతున్న ఈ సభకు మరి కొంతమంది ప్రముఖులు కూడా రానున్నారని వారు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తల సమీకరణ, స్వాగత ఫ్లెక్సీలను పరిశీలించారు. సభకు దాదాపు 20,000 మంది హాజరవుతారని అంచనా.

News September 13, 2025

జగ్గు జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం మహిళ మృతి

image

గాజువాక సమీపంలోని జగ్గు జంక్షన్ వద్ద నడిచి వెళుతున్న మహిళను ట్రాలర్ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నగంట్యాడ సమీపంలో నివాసముంటున్న విజయలక్ష్మి జగ్గు జంక్షన్ సమీపంలో నడిచి వెళుతుండగా స్టీల్‌ప్లాంట్ నుంచి వస్తున్న ట్రాలర్ ఢీకొంది. ఘటనాస్థలానికి గాజువాక ట్రాఫిక్ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.