News November 2, 2024
విశాఖ TO అమరావతి 2 గంటల్లో వెళ్లేలా..: CM
AP: విశాఖ నుంచి అమరావతికి 2 గంటల్లో వెళ్లేలా రోడ్లను నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నేషనల్ హైవేలపై ఐదేళ్లలో రూ.1.25 లక్షల కోట్లు ఖర్చు పెట్టబోతున్నామన్నారు. రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ ఏర్పాటుకు నాంది పలుకుతున్నామని, సంపద సృష్టించాలంటే మౌలిక సదుపాయాలు పెంచాలని పేర్కొన్నారు. నక్కపల్లి వద్ద రూ.70వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారని తెలిపారు.
Similar News
News November 2, 2024
BREAKING: రెండో దశ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
TG: హైదరాబాద్‌లో రెండో దశ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు జీవో 196 జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 76.4 కి.మీ మేర రూ.24,269 కోట్ల వ్యయంతో దీనిని చేపడుతున్నారు. ఇందులో రాష్ట్ర వాటా, రూ.7,313 కోట్లు, కేంద్రం వాటా రూ.4,230 కోట్లు, జికా, ఏడీబీ, ఎన్డీబీ వాటా రూ.11,693 కోట్లుగా ఉంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు.
News November 2, 2024
ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు స్పెషల్ బస్సులు: TGSRTC
కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు HYD నుంచి స్పెషల్ బస్సులను నడుపుతున్నామని TGSRTC MD సజ్జనార్ తెలిపారు. ఈ నెల 15న అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్నామని, APలోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు పేర్కొన్నారు. http://tgsrtcbus.inలో ముందస్తు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. వివరాలకు 040-69440000, 040-23450033 నంబర్లలో సంప్రదించాలన్నారు.
News November 2, 2024
సంతానం విషయంలో చంద్రబాబు కరెక్ట్: అసదుద్దీన్
TG: ఎక్కువ మంది సంతానం ఉండాలని AP, TN CMలు చంద్రబాబు, స్టాలిన్ అంటున్నారని, కానీ అదే విషయాన్ని తానంటే రాద్ధాంతం చేసేవారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ‘దక్షిణాదిలో జననాల రేటు తక్కువగా ఉందని చంద్రబాబు గుర్తించారు. ఒక వేళ జనాభా ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఎంతో నష్టం కలుగుతుంది. అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య తగ్గి దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది’ అని ఆయన పేర్కొన్నారు.