News November 2, 2024

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం

image

అనంత్‌నాగ్ జిల్లాలో శనివారం భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్ర‌వాదులు హతమయ్యారు. స్థానికంగా వీరి క‌ద‌లిక‌ల‌పై స‌మాచారం అందుకున్న బ‌ల‌గాలు ఆప‌రేష‌న్ చేప‌ట్టాయి. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో ఒక విదేశీ ఉగ్ర‌వాది స‌హా మ‌రొక‌రు మృతి చెందారు. శ్రీనగర్ ఖాన్యార్‌లో ఎదురు కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన కొద్దిసేప‌టికే ఈ ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. శుక్ర‌వారం నుంచి వ్యాలీలో నాలుగు ఉగ్ర ఘటనలు చోటుచేసుకున్నాయి.

Similar News

News November 2, 2024

PIC OF THE DAY

image

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.

News November 2, 2024

ఒంటి కాలు మీద ఎంతసేపు నిలబడగలరు?

image

ఒంటి కాలు మీద నిలబడే సామర్థ్యాన్ని బట్టి వ్యక్తి నాడీ-కండరాల పనితీరును తెలుసుకోవచ్చని ప్రముఖ వైద్యులు సుధీర్ కుమార్ తెలిపారు. 30 ఏళ్ల వ్యక్తి కళ్లు తెరిచి ఉంచి 45 సెకండ్ల కంటే ఎక్కువ సేపు నిలబడగలగాలని సూచించారు. అయితే, ఈ సామర్థ్యం వయసు రీత్యా తగ్గుతూ వస్తుందని వెల్లడించారు. 50ఏళ్ల వ్యక్తి 40Secs, 70 ఏళ్ల వ్యక్తి 20 సెకండ్లు ఒంటికాలిపై నిల్చోగలరని చెప్పారు. కళ్లు మూస్తే ఎక్కువసేపు నిల్చోలేరన్నారు.

News November 2, 2024

రిషికొండలోకి అందరినీ అనుమతిస్తాం: చంద్రబాబు

image

AP: రిషికొండ నిర్మాణాలు పూర్తయ్యాక అందరినీ అనుమతిస్తామని CM చంద్రబాబు తెలిపారు. దీనిని దేనికి ఉపయోగించాలో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘అందరితో చర్చించిన తర్వాత దీనిపై ఓ నిర్ణయానికి వస్తాం. అధికారంలో శాశ్వతంగా ఉంటామనే భ్రమలో ఈ ప్యాలెస్ కట్టారు. ఒక్క భవనం కోసం సబ్ స్టేషన్, సెంట్రల్ AC, ఫ్యాన్సీ ఫ్యాన్లు ఎందుకు? పేదలను ఆదుకునేవారు ఇలాంటివి కడతారా?’ అని ప్రశ్నించారు.