News November 2, 2024

తగ్గేదే లే.. జాబ్ కొట్టాల్సిందే

image

AP: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులతో గ్రంథాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఏపీలో కొద్ది నెలల్లో డీఎస్సీ, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వీటితో పాటు SSC, బ్యాంకులు, ఆర్ఆర్‌బీకి సంబంధించిన పరీక్షలకు తేదీలు విడుదలయ్యాయి. వచ్చే మూడు నెలల పాటు ఇవి జరగనున్నాయి. దీంతో ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

Similar News

News November 2, 2024

కార్తీక దీపోత్సవాలు.. ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితం

image

TG: కార్తీకమాసం సందర్భంగా మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇవాళ్టి నుంచి DEC 1 వరకు అన్ని ఆలయాల్లో కార్తీకమాస దీపోత్సవాలు నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ప్రతిరోజూ సా.6-8 గంటల వరకు దీపోత్సవ వేడుకలు చేయాలని, పాల్గొనే వారికి 2 మట్టి ప్రమిదలు, నూనె, వత్తులు ఉచితంగా ఇవ్వాలన్నారు. మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ ఇవ్వడంతో పాటు ప్రధాన ఆలయాల్లో బ్లౌజ్ పీస్‌లు అందించాలన్నారు.

News November 2, 2024

మురికి టాయిలెట్స్.. రైల్వేకు రూ.30వేలు ఫైన్

image

తిరుపతి నుంచి వైజాగ్‌ సమీపంలోని దువ్వాడకు వెళ్లేందుకు 55 ఏళ్ల మూర్తి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో 3AC టికెట్ కొన్నారు. ప్రయాణ సమయంలో మురికి మరుగుదొడ్లు, నీటి సౌకర్యం లేకపోవడం, ఏసీ పనిచేయకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొన్నారు. దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో మూర్తి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా విచారణ జరిపి రైల్వేకు రూ.30వేలు జరిమానా విధించింది.

News November 2, 2024

PIC OF THE DAY

image

న్యూజిలాండ్‌తో మూడో టెస్టులో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌ ఆకట్టుకుంది. డైవ్ క్యాచ్‌తో పాటు ఫీల్డింగ్‌లో అదరగొట్టారని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు. ఈరోజు మ్యాచ్ పూర్తయ్యే సరికి కోహ్లీ జెర్సీ బురదమయంగా మారిన ఫొటోను షేర్ చేస్తూ ‘PIC OF THE DAY’ అని కొనియాడుతున్నారు. టీమ్ గెలుపుకోసం ఎంతో కష్టపడతారని అభినందిస్తున్నారు. అయితే, బ్యాటింగ్‌లోనూ ఇదే కసి ఉండాల్సిందని మరికొందరు సూచిస్తున్నారు.