News November 2, 2024
తిరుమలను వక్ఫ్ బోర్డుతో ఎలా పోలుస్తారు?: విష్ణువర్ధన్ రెడ్డి
MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన <<14510629>>వ్యాఖ్యలపై<<>> AP BJP నేత విష్ణువర్ధన్‌రెడ్డి స్పందించారు. ‘మీరు హిందువుల అత్యంత పవిత్రమైన స్థలాన్ని కొన్ని కమ్యూనిటీ సెంటర్ల(వక్ఫ్ బోర్డు)తో పోల్చుతున్నారు. ముస్లింల పవిత్ర స్థలం మక్కాలో హిందువులు అడుగు పెట్టలేరు. మరి మీరు తిరుమలలో ప్రవేశించాలనుకుంటున్నారా? మీరు నిజంగా బాలాజీని విశ్వసిస్తున్నారా?’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 2, 2024
Blue Wall states: ట్రంప్ బద్దలుకొడతారా?
1992 నుంచి 2012 వరకు డెమోక్రాట్లకు కంచుకోట అయిన పెన్సిల్వేనియా, మిచిగాన్, విస్కాన్సిన్‌లను Blue Wall states అంటారు. 44 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ 3 రాష్ట్రాలు అధ్యక్ష అభ్యర్థి విజయానికి కీలకం. ఇక్కడ గెలిచినవారిదే అధ్యక్ష పీఠం. 2016లో రిపబ్లికన్ల తరఫున మొదటిసారిగా ట్రంప్ ఈ మూడు రాష్ట్రాల్ని గెలిచారు. 2020లో మళ్లీ డెమోక్రాట్లు పాగా వేశారు. దీంతో ఈసారి ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
News November 2, 2024
ఘోర ప్రమాదం.. నలుగురి మృతి
TG: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. మనోహరాబాద్(మ) పోతారం వద్ద ట్రాక్టర్-బైక్ ఢీకొని దంపతులు, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. స్థానికంగా పలువురు రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోశారు. దీంతో రోడ్డుపై ఒకవైపు నుంచే వాహనాల రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చిన బైకును ట్రాక్టర్ ఢీకొట్టడంతో నలుగురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
News November 2, 2024
పోలీసుల వాహనాల్లో డబ్బు తరలింపు: పవార్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్థుల కోసం పోలీసు వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని ఎన్సీపీ ఎస్పీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. పోలీసు శాఖ అధికారులే తనకు ఈ విషయాన్ని వెల్లడించారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలను డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఖండించారు. పవార్ ఊహల్లో జీవిస్తున్నారని, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ఇలా జరిగిందని దుయ్యబట్టారు.