News November 2, 2024
ఇజ్రాయెల్, అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

తమపై కానీ, తమ మిత్ర దేశాలపై కానీ దాడులకు దిగితే ఇజ్రాయెల్, అమెరికా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. తమ వైపు నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా గత నెల 26న ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు దెబ్బతిన్నట్లు వార్తలు వచ్చాయి.
Similar News
News January 18, 2026
నకిలీ మద్యం మరణాలకు CBN బాధ్యత వహిస్తారా: వైసీపీ

AP: నకిలీ మద్యం తాగి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు మరణించారంటూ ప్రభుత్వంపై YCP మండిపడింది. వీరి చావులకు సీఎం చంద్రబాబు బాధ్యత తీసుకుంటారా అని ‘ఎక్స్’లో ప్రశ్నించింది. అన్నమయ్య జిల్లాలో నిన్న సాయంత్రం ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం సేవించిన మణికుమార్, పుష్పరాజ్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించారని విమర్శించింది. ఎక్స్‌పైర్, నకిలీ మద్యం అమ్ముతూ TDP లిక్కర్ సిండికేట్ సొమ్ము చేసుకుంటోందని వైసీపీ ఆరోపించింది.
News January 18, 2026
పుష్ప-3 ఉంటుందా? ఉత్తి హైపేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ వేర్వేరు సినిమాలతో బిజీ అయ్యారు. దీంతో పుష్ప-3 ఉంటుందా? లేదా? అనే చర్చ జరుగుతోంది. కేవలం హైపేనా? అంటూ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ సుకుమార్ టీమ్ వాటిని కొట్టిపారేసింది. మూవీ కచ్చితంగా ఉంటుందని చెప్పింది. డైరెక్టర్, హీరో ఇతర ప్రాజెక్టుల్లో బిజీ అయినా.. టైమ్ దొరికినప్పుడల్లా కథ, స్క్రిప్ట్‌పైన వర్క్ చేస్తున్నట్లు చెప్పింది.
News January 18, 2026
పల్నాడులో YCP రక్తం పారిస్తే.. TDP నీళ్లు పారిస్తోంది: గొట్టిపాటి

AP: పల్నాడులో YCP హయాంలో రక్తం పారితే కూటమి ప్రభుత్వంలో సాగునీరు పారుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వ్యక్తిగత గొడవలకు రాజకీయ రంగు పులిమి YCP కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు 11 సీట్లకే పరిమితం చేసినా <<18871169>>జగన్<<>>కు బుద్ధి రాలేదని, శవ రాజకీయాలకు పాకులాడుతున్నారని విమర్శించారు. అక్రమ సంపాదనతో పుట్టిన YCPకి, ఆత్మగౌరవం కోసం పెట్టిన TDPకి మధ్య తేడా ఉందన్నారు.


