News November 2, 2024

ఈనెల 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈనెల 25న ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది.

Similar News

News November 2, 2024

మధ్యాహ్నం వరకే స్కూళ్లు.. మీరేమంటారు?

image

TG: కులగణన కోసం ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు 18వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలను మధ్యాహ్నం <<14507983>>ఒంటిగంట <<>>వరకే నడపనున్నారు. ఇప్పటికే అడ్మిషన్లు, పుస్తకాల ఆలస్యం, టీచర్ల బదిలీలు, పదోన్నతులు, వర్షాలతో సెలవులు రావడంతో బోధనకు ఆటంకం ఏర్పడింది. దసరా, దీపావళి సెలవుల తర్వాత ఈ నెలలో చదువులు గాడినపడతాయనుకుంటే 3 వారాలు సగం పూట బడులు పెట్టడం ఏంటని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?

News November 2, 2024

నీలి రంగు అరటి పండ్లు.. ఐస్‌క్రీమ్ తిన్నట్లే రుచి!

image

పసుపు, ఆకుపచ్చగా ఉండే అరటి పండ్లనే చూస్తుంటాం. కానీ నీలి రంగులోనూ అరటి పండ్లుంటాయనే విషయం చాలా మందికి తెలియదు. దీనిని బ్లూజావా అని పిలుస్తుంటారు. ఇది వెనీలా ఐస్ క్రీమ్ టేస్టును కలిగి ఉంటుంది. ఇవి అగ్నేయాసియాలో పెరుగుతుందని, హవాయిలో బాగా ప్రాచుర్యం పొందిందని, ‘ఐస్ క్రీమ్ బనానా’ అని పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరటి పండును మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

News November 2, 2024

రేవంత్ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు: KTR

image

TG: పరిపాలనా అనుభవం లేకుండా సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. HMDA పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావంటే పేద ప్రజల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. LRS ఫ్రీగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు.