News November 2, 2024

MBNR: పేదల తిరుపతిగా కురుమూర్తి 1/2

image

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట(M) <<14512550>>కురుమూర్తిలో<<>> ఉన్న దేవాలయం ఉమ్మడి జిల్లాలోనే అతి పురాతనమైన దేవస్థానంగా పేరుగాంచింది. తిరుమల వేంకటేశ్వర దేవాలయానికి, కురుమూర్తి దేవాలయానికి పోలికలున్నాయి. కాంచన గుహగా పేరొందిన కురుమూర్తి కొండలలో ఉన్న వెంకటేశ్వరస్వామిని వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు దర్శించుకుంటారు. సా.శ. 1268 కాలంలో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు. #Way2News ప్రత్యేక కథనం.

Similar News

News February 28, 2026

MBNR: పీయూ.. ఎల్.ఎల్.బి పరీక్షలు!!

image

పాలమూరు విశ్వవిద్యాలయంలోని ఆకాడమిక్ భావనంలో L.L.M మొదటి సెమిస్టర్ ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ మేరకు పరీక్షలను పరీక్షల నియంత్రణా అధికారి డాక్టర్ కె.ప్రవీణ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాళవి, న్యాయ కళాశాల హెచ్ఓడీ డాక్టర్ వి.రాధాకృష్ణ, జి.రవి, జగదీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

News February 28, 2026

మహబూబ్‌నగర్‌: వచ్చే నెల 4న హోలీ పండుగ

image

మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు హోలీ పండుగను మార్చి 4వ తేదీన నిర్వహించాలని జిల్లా బ్రాహ్మణ సంఘం తెలిపింది. జ్యోతిష్య పండితులచే చర్చించిన అనంతరం 2వ తేదీన కామ దహన కార్యక్రమం నిర్వహించాలని, 3న చంద్రగ్రహణం ఉన్నందున4వ తేదీన హోలీ వేడుకలు నిర్వహించుకోవాలని జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు గోండ్యాల రాఘవేంద్ర శర్మ తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు బుధవారం ఉత్సవాలు చేసుకోవాలని సూచించారు.

News February 28, 2026

జడ్చర్ల: పుట్టెడు దుఃఖంలో ఆ కుటుంబం.. దొంగల నిలువు దోపిడీ

image

జడ్చర్ల మండలం మల్లేబోయిన్‌పల్లికి చెందిన లక్ష్మి భర్త ఇటీవల చనిపోవడంతో దేవుని వద్ద నిద్ర చేసేందుకు కుటుంబంతో కలిసి వెళ్లారు. ఇల్లు ఖాళీగా ఉండటాన్ని గమనించిన దొంగలు చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ. లక్ష నగదు, 8 తులాల బంగారం, కిలో వెండి వస్తువులను ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఇంటి పెద్ద మృతితో దుఃఖంలో ఉన్న ఆ కుటుంబానికి ఈ చోరీ తీరని నష్టాన్ని మిగిల్చింది. చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు.