News November 2, 2024
అన్నీ బాగున్నాయ్.. మీకేది నచ్చింది?

దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరింపజేసేందుకు ఏకంగా నాలుగు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. తెలుగు హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’, మలయాళ నటుడు దుల్కర్ నటించిన ‘లక్కీ భాస్కర్’, తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ‘అమరన్’ పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రముఖ కన్నడ హీరో శ్రీమురళి నటించిన ‘బఘీరా’ కూడా యావరేజ్‌గా నిలిచింది. ఇవన్నీ దీపావళి విజేతలుగా నిలిచాయి. మరి మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి.
Similar News
News November 5, 2025
133 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

చెన్నైలోని ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ (<
News November 5, 2025
7 బిలియన్ ఏళ్ల కిందట విశ్వం టెంపరేచర్ ఎంత?

‘బిగ్ బ్యాంగ్’ ప్రకారం 13.8బిలియన్ ఏళ్ల కిందట ఏర్పడిన విశ్వంలో ఎన్నో అద్భుతాలు, రహస్యాలున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని జపాన్ సైంటిస్టులు కనుగొన్నారు. ఈ యూనివర్స్ టెంపరేచర్ ప్రస్తుతం 2.7K(కెల్విన్) ఉండగా, 7B ఏళ్ల కిందట 5.13 కెల్విన్(−268°C) ఉండేదని తేల్చారు. కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్‌గ్రౌండ్ పరిశీలనలు.. విశ్వం క్రమంగా చల్లబడుతోందనే అంచనాలను ధ్రువీకరిస్తున్నాయి.
* సెల్సియస్= కెల్విన్-273.15
News November 5, 2025
భరణి నక్షత్రంలో కార్తిక పౌర్ణమి విశిష్టత

సాధారణంగా కార్తిక పౌర్ణమి కృత్తిక నక్షత్రంతో శ్రేష్ఠమైనది. కానీ ఈ ఏడాది భరణి నక్షత్రంతో కూడిన పౌర్ణమి వచ్చింది. దీనికి ప్రత్యేక స్థానం ఉందని పండితులు చెబుతున్నారు. ‘ఈ పౌర్ణమి+భరణి కలయిక పాపాలను పోగొట్టి, మోక్షాన్ని, పితృదేవతల ప్రసాదాన్ని ఇస్తుంది. నేడు చేసే దీపదానం, పితృతర్పణం, గంగాస్నానం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుంది. కృత్తిక జ్ఞాన ప్రకాశాన్నిస్తే భరణి పాప నాశనం చేస్తుంది’ అంటున్నారు.


