News November 2, 2024
SKLM: రూ.1.50 లక్షల చెక్కు అందించిన కలెక్టర్

క్యాన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన 24 గంటల్లోనే బాధిత కుటుంబానికి రూ.1.50 లక్షల చెక్కును కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం అందజేశారు. జలుమూరు మండలం కరకవలస గ్రామానికి చెందిన పేరాడ సాయిరాం తన తల్లి అమ్మన్నకు క్యాన్సర్ సోకిందని, ఎంత ఖర్చు చేసినా మెరుగైన వైద్యం అందించలేక పోతున్నామని ముఖ్యమంత్రి ఎదుట వాపోయాడు.
Similar News
News January 31, 2026
శ్రీకాకుళం: విద్యార్థులను చితకబాదిన టీచర్

నందిగాంలోని దేవాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు శుక్రవారం విద్యార్థులపై తన ప్రతాపాన్ని చూపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. హోమ్ వర్క్ రాయకుండా అల్లరి చేస్తున్నారనే కారణంతో ఒంటిపై వాతలు కనిపించేలా కర్రతో కొట్టారని మండిపడ్డారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
News January 30, 2026
శ్రీకాకుళం కలెక్టర్ సీరియస్

జగన్నాథ సాగర్ ఆక్రమణలపై పత్రికల్లో వచ్చిన కథనాలపై కలెక్టర్ దినకర్ స్పందించారు. శుక్రవారం ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. చెరువు పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలను జేసీబీలతో తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో 24 గంటల్లోగా ఆక్రమణలన్నీ తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, తహశీల్దార్ కళ్యాణ్ చక్రవర్తి వివరించారు.
News January 30, 2026
శ్రీకాకుళం: ఫాలోవర్లకు నకిలీ పాసులు వచ్చాయా?

అరసవల్లి ఆదిత్యుని రథసప్తమి వీఐపీ పాసులు, తదితర టిక్కెట్ల నకిలీ ముద్రణ అంశాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకల్లో సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లను ప్రచారానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రాధాన్యత ఇచ్చారా? అదే అదునుగా ఈ నకిలీ పాస్‌లు ముద్రించారానే ప్రశ్నలు లేవనెత్తున్నాయి. వీరికి అండగా నిలిచిందెవరు? నకిలీ పాసులతో రద్దీ ఎక్కువైందా? పలు కోణాల్లో ఖాకీలు దర్యాప్తు చేస్తున్నారు.


