News November 2, 2024

చాక్లెట్ల చరిత్ర మీకు తెలుసా?

image

ప్రస్తుతం ఏ శుభకార్యం జరిగినా అక్కడ చాక్లెట్లు ఉండాల్సిందే. ఈ చాక్లెట్లకు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. తొలుత అమెరికాలోని కోకో చెట్ల పళ్లలోని రసం తీసి తాగేవారు. 1519లో ఈ రసాన్ని స్పెయిన్ తమ దేశానికి తీసుకువచ్చింది. ఆ తర్వాత యూరప్ ప్రాంతానికి పరిచయమైంది. వందల ఏళ్లపాటు రసంగానే తాగారు. 1819లో తొలిసారిగా స్విట్జర్లాండ్‌లో చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అప్పటి నుంచి అవి బిళ్లల రూపంలోకి మారాయి.

Similar News

News December 26, 2024

పిల్లలకు చదువుతోపాటు వీటిని నేర్పిస్తున్నారా?

image

పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలంటే ఐదు ఆధ్యాత్మిక అంశాలు నేర్పాలి. పిల్లలను కృతజ్ఞతాభావంతో పెంచాలి. ఎవరైనా సాయం చేసినప్పుడు వారికి కృతజ్ఞతలు చెప్పించాలి. చిన్నతనం నుంచే మనుషులు, మొక్కలు, జంతువులపై దయ ఉండేలా మలచాలి. చిన్నారుల్లో పరధ్యానం పోగొట్టడానికి ఏకాగ్రత అలవర్చాలి. క్షమాగుణం కూడా అలవాటు చేయాలి. ఎవరైనా తప్పు చేసినా పగ తీర్చుకోకుండా క్షమించడాన్ని నేర్పాలి. ఆధ్యాత్మికతపై వారిలో ఆసక్తిని పెంచాలి.

News December 26, 2024

మస్కట్‌ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్

image

AP: మస్కట్‌లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.

News December 26, 2024

Latest Data: ఓటింగ్‌లో మహిళలే ముందు

image

2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో 65.78% మంది అర్హ‌త క‌లిగిన మ‌హిళ‌లు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న‌ట్టు తాజా గ‌ణాంకాల ద్వారా వెల్ల‌డైంది. పురుషులు 65.55% మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. త‌ద్వారా వ‌రుస‌గా రెండు సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పురుషుల కంటే మ‌హిళ‌లే అత్య‌ధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. 2019లో మొత్తంగా 61.40 కోట్ల మంది ఓటేస్తే, 2024లో 64.64 కోట్ల మంది ఓటేయ‌డం గ‌మ‌నార్హం.