News November 2, 2024
మధ్యాహ్నం వరకే స్కూళ్లు.. మీరేమంటారు?

TG: కులగణన కోసం ఈ నెల 6 నుంచి 3 వారాల పాటు 18వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలను మధ్యాహ్నం <<14507983>>ఒంటిగంట <<>>వరకే నడపనున్నారు. ఇప్పటికే అడ్మిషన్లు, పుస్తకాల ఆలస్యం, టీచర్ల బదిలీలు, పదోన్నతులు, వర్షాలతో సెలవులు రావడంతో బోధనకు ఆటంకం ఏర్పడింది. దసరా, దీపావళి సెలవుల తర్వాత ఈ నెలలో చదువులు గాడినపడతాయనుకుంటే 3 వారాలు సగం పూట బడులు పెట్టడం ఏంటని పేరెంట్స్, విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News October 17, 2025
ఇతిహాసాలు క్విజ్ – 38 సమాధానాలు

1. సీతాదేవి స్వయంవరంలో శ్రీరాముడు విరిచిన శివధనస్సు పేరు ‘పినాక’.
2. మహాభారత యుద్ధంలో శకునిని చంపింది ‘సహదేవుడు’.
3. మహాశివరాత్రి ‘మాఘ’ మాసంలో వస్తుంది.
4. త్రింశత్ అంటే ‘ముప్పై’.
5. శివాలయాలలో గర్భగుడి నుంచి అభిషేక జలం బయటకు వెళ్లే ద్వారాన్ని ‘సోమసూత్రం’ అని అంటారు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 17, 2025
జనసేన వినూత్న కార్యక్రమం: పవన్ కళ్యాణ్

AP: రాజకీయ వ్యవస్థలో నవతరం యువతను భాగస్వామ్యం చేసేందుకు “సేనతో సేనాని – మన నేల కోసం కలిసి నడుద్దాం” అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీని ద్వారా ఔత్సాహిక యువతీ, యువకులు తమకు నచ్చిన అంశాన్ని ఎంచుకుని సేవలు అందించే అవకాశాన్ని ఈ వేదిక కల్పించనుందని చెప్పారు. పూర్తి వివరాలకు జనసేన పార్టీ <
News October 17, 2025
RCBని అమ్మేయాలని ప్రయత్నాలు?

IPL: RCBని $2 బిలియన్లకు అమ్మేందుకు పేరెంట్ కంపెనీ Diageo ప్రయత్నాలు చేస్తోందని Cricbuzz తెలిపింది. IPLలో లిక్కర్ బ్రాండ్ల యాడ్లపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన రూల్స్ తేవడంతో లాభదాయకం కాదని భావిస్తున్నట్లు సమాచారం. అధార్ పూనావాలా (సీరమ్ ఇన్స్టిట్యూట్), పార్థ్ జిందాల్ (JSW గ్రూప్), అదానీ గ్రూప్, ఢిల్లీకి చెందిన ఓ కంపెనీ, మరో రెండు అమెరికా ప్రైవేట్ సంస్థలు ఆర్సీబీని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయట.