News November 2, 2024

ALERT: రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Similar News

News November 3, 2024

కెనడా రాజ‌కీయాల్లో హిందువుల ప్రాతినిధ్యం పెర‌గాలి: చంద్ర ఆర్య‌

image

కెన‌డా ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థలో ఎక్కువ మంది హిందువులు భాగ‌స్వామ్యం అయ్యేలా రాజ‌కీయాల్లో వారి ప్రాతినిధ్యం పెర‌గాల‌ని కెన‌డియ‌న్ MP చంద్ర ఆర్య పిలుపునిచ్చారు. Hindu Heritage Month సంద‌ర్భంగా Parliament Hillలో ఆయ‌న‌ కాషాయ జెండాను ఎగురవేశారు. కెన‌డాలో మూడో అతిపెద్ద మ‌త స‌మూహమైన హిందువులు దేశ వృద్ధికి విశేష కృషి చేస్తున్నార‌ని, అదేవిధంగా రాజ‌కీయాల్లో కూడా క్రీయాశీల‌కంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

News November 3, 2024

HOPE: 11 దేశాలపై శతకాలు బాదేశాడు

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ షయ్ హోప్ (117) శతకంతో మెరిశారు. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన హోప్ ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. 127 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 117 పరుగులు బాదారు. ఇప్పటివరకు ఆయన 11 దేశాలపై సెంచరీలు చేశారు. కార్టీ (71), రూథర్‌ఫర్డ్ (54) కూడా రాణించడంతో ఓవర్లన్నీ ఆడి విండీస్ 328/6 రన్స్ సాధించింది.

News November 3, 2024

నవంబర్ 3: చరిత్రలో ఈరోజు

image

* 1874: సాహితీవేత్త, నాటకరంగ ప్రముఖుడు మారేపల్లి రామచంద్ర శాస్త్రి మరణం
* 1906: బాలీవుడ్ నటుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ పృథ్వీరాజ్ కపూర్ జననం
* 1933: నోబెల్ బహుమతి పొందిన భారత తొలి ఆర్థిక శాస్త్రవేత్త అమర్త్యసేన్ పుట్టినరోజు
* 1937: ప్రముఖ సింగర్ జిక్కి జయంతి
* 1940: విప్లవ రచయిత వరవరరావు పుట్టినరోజు
* 1998: విలక్షణ నటుడు పీఎల్ నారాయణ మరణం