News November 2, 2024
ఉద్యోగి ఆత్మహత్యపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
విధులకు సంబంధించి పైస్థాయి వ్యక్తి తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగి ఆత్మహత్యకు కారణంగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ‘ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లోని వ్యక్తుల నిర్ణయాలు ఉద్యోగులకు కొన్నిసార్లు కష్టతరంగా అనిపించవచ్చు. అయితే హానికారక ఉద్దేశం లేకపోతే ఉద్యోగి ఆత్మహత్యకు వారిని బాధ్యులుగా పరిగణించలేం’ అని బీఆర్ అంబేడ్కర్ కాలేజీ(Delhi వర్సిటీ) EX ప్రిన్సిపల్ కేసులో పేర్కొంది.
Similar News
News November 4, 2024
మార్కెట్లో చైనా డేంజర్ వెల్లుల్లి! గుర్తించండిలా
కేంద్రం 2014లోనే చైనా వెల్లుల్లిని నిషేధించినా అధిక లాభాలకు కొందరు దీన్ని అక్రమంగా దిగుమతి చేసి విక్రయిస్తున్నారు. దీన్ని పండించేందుకు వాడే మిథైల్ బ్రోమైడ్ వంటి రసాయనాలు అల్సర్లు, జీర్ణ, కిడ్నీ సమస్యలు, తీవ్ర దగ్గు, మెదడు దెబ్బతినడం, కాళ్లు/చేతులు మొద్దుబారడానికి కారణమవుతాయి.
☞ఈ వెల్లుల్లి సైజులో చిన్నగా, బాగా తెల్లగా/పింక్ రంగులో ఉంటుంది. తక్కువ ఘాటు వస్తుంది. సులువుగా పొట్టు తీయొచ్చు.
Share It
News November 4, 2024
పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి: సీఎం
TG: ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు మంచిర్యాల విద్యార్థులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్కిల్ యూనివర్సిటీ, ITIలు ATCలుగా మార్పు, స్పోర్ట్స్ యూనివర్సిటీ గురించి వారికి వివరించారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మకుండా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. గంజాయి బారిన పడొద్దన్నారు.
News November 4, 2024
భర్తనే మళ్లీ పెళ్లి చేసుకున్న సన్నీ లియోన్
మాజీ పోర్న్ స్టార్, బాలీవుడ్ నటి సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్‌ను మళ్లీ పెళ్లి చేసుకున్నారు. వీరు 2011లోనే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లయి 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇద్దరూ వధూవరుల్లా ముస్తాబై మాల్దీవ్స్‌లో తమ ముగ్గురు పిల్లల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు. వీరు ఓ పాపను దత్తత తీసుకొని, మరో ఇద్దరిని సరోగసి ద్వారా పొందారు. కాగా వీరి రీవెడ్డింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.