News November 3, 2024
ఈ కందిరీగల స్పెషల్ పవర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

వెస్పా జాతి కందిరీగలకు ఉన్న ఇథనాల్(ఆల్కహాల్ కాంపోనెంట్) డిటాక్సిఫికేషన్ పవర్ ప్రపంచంలో మరే జంతువులకీ లేదని సైంటిస్టులు తెలిపారు. ఇథనాల్ అధికంగా ఉన్న తాటి పువ్వుల నుంచి ఇవి మకరందాన్ని సేవిస్తాయి. అయినప్పటికీ వాటి జీవితకాలం, జీవక్రియలపై ఇథనాల్ ఎలాంటి ప్రభావం చూపడం లేదని గుర్తించారు. ఈ కందిరీగల్లో ఇథనాల్‌ను అత్యంత వేగంగా మెటబాలిజింగ్ చేసే శక్తి ఉండటంతో వాటికి డిటాక్సిఫికేషన్ పవర్ అందుతోందన్నారు.
Similar News
News November 16, 2025
మెంటార్‌ని ఎంచుకుంటున్నారా?

మీరు రాణించాలనుకొనే రంగంలో సీనియర్లను మెంటార్‌గా ఎంచుకొనే ముందు వారు నిజంగా మీకు మార్గం చూపించడానికి తగిన వారేనా అన్నది గుర్తించాలి. వారిలో ఏ అంశం మిమ్మల్ని ప్రభావితం చేస్తుందో గమనించాలి. అపజయాలు పొందిన వాళ్లనీ మార్గదర్శకుడిగా ఎన్నుకుంటే వారి తప్పుల గురించి తెలుసుకోవచ్చు. మెంటార్ శభాష్ అని వెన్ను తట్టడమే కాకుండా, తప్పు చేస్తున్నప్పుడు నిర్మొహమాటంగా తగదని మందలించే వారై ఉండాలి.
News November 16, 2025
రేషన్ కార్డు ఉంటేనే..

TG: ఫీజు రీయింబర్స్‌మెంటును పెద్దఎత్తున అనర్హులు పొందుతున్నారన్న ఆరోపణలతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌కమ్ సర్టిఫికెట్ దరఖాస్తుకు రేషన్ కార్డును లింక్ చేసింది. అంటే ఇకపై రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధ్రువీకరణ పత్రం వస్తుంది. మీసేవ సెంటర్లలో రేషన్ కార్డులు లేని వారు అప్లై చేస్తే ‘మిస్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు’ అని మెసేజ్ వస్తుంది. దీంతో అనర్హులకు అడ్డుకట్ట వేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
News November 16, 2025
అదరగొట్టిన IND బౌలర్లు.. 132 పరుగులకే SA-A ఆలౌట్

రాజ్‌కోట్ వేదికగా ఇండియా-Aతో జరుగుతోన్న రెండో అనధికార వన్డేలో సౌతాఫ్రికా-A 132 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో రివాల్డో మూన్‌సామి (33) టాప్ స్కోరర్‌గా నిలిచారు. భారత బౌలర్లలో నిశాంత్ సింధు 4, హర్షిత్ రాణా 3, ప్రసిద్ధ్ 2 వికెట్లు పడగొట్టగా తిలక్ వర్మ ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే ఇండియా-A 50 ఓవర్లలో 133 రన్స్ చేయాలి. కాగా తొలి వన్డేలో IND-A గెలిచిన విషయం తెలిసిందే.


