News November 3, 2024

జనవరిలో కొత్త రేషన్ కార్డులు!

image

AP: నూతన సంవత్సర కానుకగా JANలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న కార్డులను రీడిజైన్ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్‌తో అందజేయనుంది. పౌరసరఫరాల అధికారులు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి.

Similar News

News January 30, 2026

మోకాళ్ల నొప్పి రాగానే నడక ఆపేస్తున్నారా?

image

చాలామంది మోకాళ్ల నొప్పి రాగానే నడవడం ఆపేస్తారు. అయితే మోకాళ్ల నొప్పులు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం పరిష్కారం కాదని, అది కీళ్లు బిగుసుకుపోయేలా చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నడవడం వల్ల కీళ్ల మధ్య జిగురు పెరిగి కండరాలు దృఢంగా మారి ఒత్తిడిని తట్టుకుంటాయని చెబుతున్నారు. ఈత, సైక్లింగ్ వంటివి ప్రయత్నించాలని.. మరుసటి రోజు నొప్పి పెరగకపోతే అది మీకు సురక్షితమని అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.

News January 30, 2026

ఇకపై గూగ్లీకి గూగుల్ సాయం: సుందర్ పిచాయ్

image

ICCతో Google ఒప్పందంపై ఆ సంస్థ CEO సుందర్ పిచాయ్ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు గూగుల్ మీ గూగ్లీకి సహాయం చేయగలదు’ అంటూ పేర్కొన్నారు. ఈ డీల్ ప్రకారం ఇక నుంచి గూగుల్ జెమిని 3 ప్రో AI మోడల్ లైవ్ మ్యాచ్‌లను చూస్తూ కామెంట్రీని వింటుంది. మ్యాచ్‌లోని హైలైట్స్‌ను, బ్యాటింగ్, బౌలింగ్‌లోని టెక్నిక్స్‌ను ఫ్యాన్స్‌కు వివరిస్తుంది. T20 WC నుంచి క్రికెట్‌లోనూ AI సేవలు ప్రారంభం కానున్నాయి.

News January 30, 2026

CBN, పవన్ మామూలు తప్పు చేయలేదు: YCP

image

AP: రాజకీయ స్వలాభానికి CBN, పవన్ మామూలు తప్పు చేయలేదని YSRCP మండిపడింది. ‘‘లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని CBN చెప్పడం, దానిపై పవన్ ఊగిపోవడాన్ని ప్రజలు గమనించారు. గారడీ వాడు చెబితే కోతి ఆడినట్లుగా CBN చెప్పడం, పవన్ యాక్షన్‌లోకి దిగిపోవడం అంతా ప్లాన్ ప్రకారం సాగుతోంది. లడ్డూలో కల్తీ లేదని CBI రిపోర్టు ఇచ్చింది. పొలిటికల్ పార్ట్‌నర్లు ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి’’ అని SMలో పోస్ట్ పెట్టింది.