News November 3, 2024

‘సదర్’కు రాష్ట్ర పండుగ హోదా

image

TG: రాష్ట్ర ప్రభుత్వం సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. HYD మినహా అన్ని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎంపీ అనిల్ కుమార్ విజ్ఞప్తితో అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News January 23, 2026

నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్‌లో ఉద్యోగాలు

image

<>నేషనల్<<>> సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ 3 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్/ఐటీఐ అర్హత గలవారు ఫిబ్రవరి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.18000-రూ.56,900. వెబ్‌సైట్: https://www.ncess.gov.in

News January 23, 2026

ఆర్థిక సంస్థల కేంద్రంగా అమరావతి: CBN

image

AP: వ్యవసాయంతో పాటు రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలకూ అధిక రుణాలివ్వాలని CM CBN బ్యాంకర్ల సమావేశంలో సూచించారు. డిస్కంలు కూడా కౌంటర్ గ్యారంటీ ఇస్తున్నాయని చెప్పారు. ‘అమరావతిని ఆర్థిక సంస్థల కేంద్రంగా మారుస్తున్నాం. 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటవుతున్నాయి. డ్వాక్రా సంఘాల ఖాతాలపై వేస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించాలి. ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్‌ను ప్రోత్సహించాలి’ అని పేర్కొన్నారు.

News January 23, 2026

భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు

image

స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అమ్మకాల ఒత్తిడితో సెన్సెక్స్‌ 769.67 పాయింట్లు క్షీణించి 81,537.70 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 241.25 పాయింట్లు పడిపోయి 25,048.65కు దిగజారింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, అదానీ పోర్ట్స్‌, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (Indigo), సిప్లా వంటి షేర్లు భారీగా నష్ట పోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ONGC వంటివి కొంత మేర లాభాల్లో నిలిచాయి.