News November 3, 2024

HYD నగరంలో మరో స్కైవాక్

image

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ శుభవార్త తెలిపింది. HYD నగరంలో మరో స్కైవాక్ అందుబాటులోకి రానుంది. పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ సమీపంలో కొత్తగా స్కైవాక్ నిర్మించనున్నారు. మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్ఎంసీ స్కైవాక్ నిర్మించనుంది.

Similar News

News January 9, 2026

మూసీ ప్రాజెక్ట్‌కు 200 ఎకరాల అదనపు సేకరణ

image

​మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో ఎదురవుతున్న భూసేకరణ అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బాపుఘాట్ పరిసరాల్లోని సుమారు 200 ఎకరాల డిఫెన్స్ భూమిని సేకరించేందుకు కేంద్రంతో సంప్రదింపులు తుది దశకు చేరుకున్నాయి. ఈ భూమి లభిస్తే, నది వెడల్పును పెంచడంతో పాటు అక్కడ భారీ స్థాయిలో ‘నైట్ ఎకానమీ’ హబ్‌ను, అంతర్జాతీయ స్థాయి వాక్-వేలను నిర్మించవచ్చని ఓ అధికారులు Way2News కు తెలిపారు.

News January 9, 2026

HYD: రాహుల్ సిప్లిగంజ్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్

image

రాహుల్ సిప్లిగంజ్ నటిస్తున్న ‘కల్ట్’ వెబ్ సిరీస్‌పై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. కోర్టు విచారణలో ఉన్న మదనపల్లి చిన్నారుల హత్య కేసు ఆధారంగా తప్పుడు కథతో వెబ్ సిరీస్ నిర్మించి ఈ నెల 17న విడుదలకు ప్రయత్నించడం సరికాదని పిటిషనర్ ఉత్తం వల్లూరి చౌదరి తెలిపారు. ఇది తమ పరువు ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. కేసును అడ్వకేట్ రామారావు ఇమ్మానేని వాదిస్తున్నారు.

News January 9, 2026

HYD: 2 రోజులు వాటర్ బంద్

image

నగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పరిధిలోని పలు ప్రాంతాలకు రేపు ఉ.6 గం. నుంచి ఆదివారం సా.6 వరకు అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలినగర్, నాగోల్, బడంగ్ పేట, ఆదిభట్ల, బాలాపూర్ రిజర్వాయర్, నాచారం, తార్నాక, లాలాపేట, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు, శాస్త్రిపురం నేషనల్ పోలీస్ అకాడమీ తదితర ప్రాంతాల్లో సరఫరా ఉండదన్నారు.